మొత్తం మీద మన సమాజమూ, ప్రభుత్వాలూ గుర్తించవలసిన సత్యం ఒక్కటే: అదేమంటే, పిల్లల సినిమా అనేది ఒక జానర్ కాదు, మన సమాజం పిల్లల ప్రపంచాన్ని ఎంత గౌరవిస్తున్నదో చూపించే ఒక సూచిక. ఈ నిష్ఠుర సత్యం పట్ల ఒక్క అనిల్ బత్తుల మాత్రమే కాదు, పిల్లల ప్రేమికులు ప్రతి ఒక్కరూ మేల్కొనవలసి ఉంది.
గాలినాసరరెడ్డికి లేఖలు
అందుకనే అనిల్ బత్తుల సంకలనం చేసిన 'గాలినాసరరెడ్డికి లేఖలు, 1982-2012' (బోధి ఫౌండేషన్, 2025) నా చేతికి అందగానే మొత్తం 86 ఉత్తరాలూ ఏకబిగిని చదివేసాను. ఇంతకీ ఇవి నాసరరెడ్డి రాసిన లేఖలు కావు, నాసరరెడ్డికి కవిమిత్రులు రాసినవి. అంటే కవిని నేరుగా చూడకుండా అద్దంలో చూసినట్టుగా అన్నమాట.
అజంతా కవితలు
మొన్న అజంతా మీద ప్రసంగిస్తూ ఆయన స్వప్నలిపిలో చేరని కొన్ని కవితలున్నాయని చెప్పాను కదా. ఆసక్తి ఉన్నవారి కోసం ఆ కవితల్ని ఇక్కడ అందిస్తున్నాను
