హృదయానందం రెణ్ణాళ్ళ వేడుక

అమృత సంతానం ఆరాధకుల్లో మరొక రసజ్ఞుడు వచ్చి చేరాడు. కవిత్వ రసవాది నౌదూరి మూర్తి గారు అమృతసంతానం చదువుతున్నారనీ, ఆయన ఒక విశ్లేషణ రాయబోతున్నారనీ వాసు నన్ను కొన్నాళ్ళుగా ఊరిస్తో ఉన్నాడు. రాత్రి ఆ వ్యాసం చదువుతోంటే, ఈ వాక్యాలకు వచ్చేటప్పటికి నా హృదయం కొట్టుకోడం ఆగిపోయింది