కబీరు-5

నిన్ను అహర్నిశం వెంటాడుతున్న మృత్యువునుంచి నిన్ను కాపాడగలిగేది ఆ శబ్దం మాత్రమే. దాన్నే అతడు గురువు, హరి, సారంగపాణి,మధుసూధనుడు లాంటి పదాలతో సూచిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రాముడు. ఈ రాముడు దశరథ తనయుడు కాడు. ఇతడు సర్వాంతర్యామి కాగా దశరథ రాముడు ఒక దేహధారి మాత్రమే