ఇది శ్రీధర్ తో పాటు మీకందరికీ దసరా కానుకగా అందిస్తున్నాను. డౌన్ లోడ్ చేసుకుని కిండిల్ లో చదువుకోవచ్చు. మీ మిత్రులకి కూడా కానుకగా పంపవచ్చు. పుస్తకం నచ్చితే మీ అభిప్రాయం తెలపవచ్చు.
వేదార్థ మీమాంస
సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన డా.కొత్త సచ్చిదానందమూర్తి వేదాలను అర్థం చేసుకోవడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, అయినప్పటికీ, ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధానంగా నిరుక్తం వైపూ, పూర్వ ఉత్తర మీమాంసల వైపూ, స్మృతి, ఇతిహాస, పురాణాల వైపూ, సాయణుల వైపూ, ఇతర భాష్యకారుల వైపూ మొగ్గు చూపడం ఈ రచనలో విశేషం.
జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు
ఆధునిక పాశ్చాత్యతత్త్వశాస్త్రంలో అత్యున్నత స్థాయి తాత్త్వికుడిగా పరిగణించబడుతున్న ఇమాన్యువల్ కాంట్ (1724-1804) రచనలనుండి ఎంపికచేసిన ప్రధానమైన భాగాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన అనువాదం.
