నా ఇంగ్లాండ్ యాత్ర-9

15

లండన్ లో ఒక ఉదయం

మర్నాడు ఉదయం హోటల్ ఖాళీచేసి ఊరు తిరగడానికి బయటకొచ్చేటప్పటికి తెల్లవారు జామున పడ్డ వానకి రోడ్లన్నీ తడిసి ఉన్నాయి. గాల్లో చెర్రీ సుమదళాలు ఎగుర్తున్నాయి. ఆదివారం తీరికలోంచి నగరం ఇంకా నిద్ర లేవలేదు. మేం కొంతదూరం నడుచుకుంటూ హైడ్‌పార్క్‌ లో ప్రవేశించాం. విస్తారమయిన పచ్చిక తిన్నెలు వానకు తడిసి ఒద్దిగ్గా ముడుచుకుకుని ఉన్నాయి. పొడవైన ఉద్యానవృక్షాలకి ఇంకా వసంతస్పర్శ సోకలేదు. ప్రఖ్యాతమైన స్పీకర్స్ కార్నర్‌లో ఒక క్రైస్తవ ప్రసంగీకుడు బైబిల్ ప్రసంగాన్ని సాగిస్తున్నాడు. ఇద్దిష్‌లో పరలోకరాజ్యం గురించిన వాగ్దానాలు రాసిన పోస్టరు తగిలించుకున్నాడు. యూరప్‌నుండి వచ్చిన కొందరు విద్యార్థులు అతని చుట్టూ మూగారు. ప్రాపంచికజీవితం గురించి ఆ వక్త చేస్తున్న హెచ్చరికల్ని వారు వెక్కిరిస్తున్నారు.

మేం ముందుకి కదిలాం. మా ముందు చూడవలసిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. మేం ముందుగా రాజభవనం దగ్గర రక్షకభటులు డ్యూటీ మారే సమయంలో జరిగే ఆసక్తికరమయిన ప్రోటోకాల్ చూసి, ట్రఫాల్గర్ స్క్వేర్ దగ్గర కొంతసేపు గడిపాం. విక్టోరియన్ యుగపు మహాసేనాధిపతి అయిన నెల్సన్ జ్ఞాపకార్ధం నిర్మించిన విజయస్తంభం, చుట్టూరా గ్రానైట్ సింహాలు, ఎదురుగా బిగ్ బెన్, పక్కన నేషనల్ గాలరీ. విశ్వనాథ సత్యనారాయణ గారి గంధర్వుడు, ‘హాహా హూహూ’ భూమ్మీదకు వచ్చిపడ్డది అక్కడే.

అక్కణ్ణుంచి కోహినూర్ వజ్రాన్ని చూడాలని మిత్రుడు తహతహలాడటంతో మళ్ళా లండన్ ట్రైన్ పట్టుకుని లండన్ టవర్‌కు చేరుకున్నాం. అది ఒక దుర్గం, ఒక చెరసాల, ఒక వధ్యశిల, ఒక మింట్, ఒక ప్రదర్శన. మొదటి విలియం చక్రవర్తి (1066) నుండీ ఇంగ్లీష్ చరిత్రకు అది సాక్షి. దాన్ని అంటిపెట్టుకుని ఎన్నో భయానకజ్ఞాపకాలున్నాయి. మొదటి ఛార్లెస్ చక్రవర్తిని ఉరితీసింది అక్కడే. మరోప్రపంచపు స్వాప్నికుడు ‘యుటోపియా’ గ్రంధకర్త థామస్ మోర్‌ని కూడా అక్కడే వధించి ఆయన శిరసుని లండన్ బ్రిడ్జి దగ్గర వేలాడదీశారు. మహాప్రేమికుడూ, మానవతావాదీ, ఇంగ్లీష్ సోక్రటీస్ అనదగిన థామస్ మోర్ తనని వధించబోతున్న తలారితో ‘మానవుడా, ధైర్యం వహించు, నీ విధి నువ్వు నిర్వహించు. నా మెడ కొద్దిగా పొట్టిది, నువ్వు కత్తి విసిరేటప్పుడు గురి తప్పకుండా చూసుకో’ అని సలహా ఇచ్చాడట!

ఇప్పుడు ఆ టవర్ బయటి ప్రాంగణమంతటా పువ్వులు. లోపల రాజవంశీకుల ఆభరణాలు. ఎలిజెబెత్ రాణి పట్టాభిషేకాన్ని చూపించే డాక్యుమెంటరీ చూసుకొంటో కోహినూర్ వజ్రాన్ని చూడబోతుంటే కాళ్ళు తడబడ్డాయి. ‘నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం’ అన్న కవితావాక్యానికి భౌతిక ప్రతీక ఆ వజ్రం. కాని ఎంత నిష్కళంకంగా, ఎంత స్వచ్ఛధవళంగా మెరుస్తోందని. కృష్ణానదీ తీరంలో మూడు శతాబ్దాల కిందట బయటపడ్డ ఆ వజ్రం గోల్కొండ నవాబుల చేతుల మీదుగా షాజహాన్‌కు చేరింది. నాదిర్షా దండయాత్రలో మొఘలుల చేజారిన ఆ వజ్రం, తిరిగి ఇండియాను చేరినా, పంజాబ్ ఆక్రమణ తర్వాత ఈస్టిండియా కంపెనీ దాన్ని విక్టోరియా మహారాణికి బహుకరించడంతో ఇంగ్లీషు రాజవంశీకుల ఆభరణాల్లో చేరిపోయింది. మనుషుల మధ్య హింసాక్రౌర్యాలకు గుర్తుగా మిగిలిన ఆ వజ్రాన్ని రాజులెవ్వరూ ధరించడానికి ఇష్టపడక రాణీమాత కిరీటంలో చోటుచేసుకుంది. కానీ మన కవులు ఇంకా దేశమాతనుద్దేశించి ‘కోహినూరు నీ సిగలో పువ్వట’ అంటో కీర్తించడం మానలేదు.

మళ్ళా మేం ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దిగి సెయింట్ జేమ్స్ పార్క్‌ లోంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకుని అక్కడ కొద్దిసేపు గడిపాం. సన్నగా చినుకులు పడుతుంటే నిండుగా వికసించిన విల్లో కొమ్మల నీడన నిల్చుని ఫోటోలు తీసుకున్నాం. మా తిరుగుప్రయాణానికి బస్‌టైమ్ అవుతోంది. కారల్‌మార్క్స్ సమాధి చూడలేక పోతున్నానన్న నిరాశని పక్కకి తోసుకుని లండన్ గురించి నా ఇంప్రెషన్స్‌ ను పునఃచిత్రించుకునే ప్రయత్నం చేశాను.

వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జిని తలచుకున్నప్పుడు వర్డ్స్ వర్త్ రాసిన కవిత, ఇంతకు ముందు చదివినపుడు ఏమీ స్పందన కలిగించని ఆ కవిత, నేడు అక్షరసత్యం అన్పించింది. 1802లో లండన్‌ని చూసినప్పుడు నిస్పృహచెంది మిల్టన్‌ని తలుచుకున్న ఆ కవే వెస్ట్‌ మినిస్టర్ బ్రిడ్జిపైన ఈ పంక్తుల్ని కూడా కంపోజ్ చేశాడు.

నిజానికి మొదటి వాక్యాన్ని ‘పృథ్వికి ఇంతకన్నా సుందరతరమైంది చూపడానికి మరేమీలేదు’ అని తెనిగించాలి. కవి వాక్యంలో అసత్యం లేదు. సెయింట్ జేమ్స్ పార్క్‌ లో సరసుపైన వాలిన లేతాకుపచ్చని విల్లోశాఖలు గాలికి వూగుతున్నప్పుడు, నీళ్ళల్లో బాతులు ప్రశాంతతరంగాల్ని కెరలిస్తున్నప్పుడు, పైనుంచి సన్నని ఈస్టర్ వాన చినుకులు ముత్యాల్లా రాలుతుంటే సుందరమయిన పృథ్వికి సమోవాకాలు అర్పించకుండా వుండటం కష్టం.

విక్టోరియన్ యుగపు వాస్తు తన సమస్తవైభవమంతటితోనూ నేడు బూజుపడుతోంది. లండన్ నేడు ఓపెన్‌టాప్ బస్సుల్లో ‘నా గతచరిత్ర ఇంత గొప్పదం’టో ఎడ్వర్టయిజ్ చేసుకొంటోంది. ఇప్పుడా సామ్రాజ్యం లేదు, ఆ సేనాధిపతుల్లేరు. కాని పువ్వులింకా వికసిస్తూనే ఉన్నాయి, పక్షులింకా విహరిస్తూనే వున్నాయి. ట్రఫాల్గర్ స్క్వేర్‌లోని నెల్సన్ స్మారకస్తంభం రేపు కూలిపోవచ్చు, కాని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపైన వర్డ్స్‌ వర్త్ కవిత సదా నిలిచే వుంటుంది. సర్ థామస్ మోర్ యుటోపియా రానున్న ఎన్నో తరాల పాటు మనుషుల్ని మరోప్రపంచపు ఆదర్శాలవైపు ప్రోత్సహిస్తూనే ఉంటుంది.

లండన్! నీకు నా నమస్కారం. నువ్వు నీ అధికార దర్పాన్ని చూపినప్పుడు మా మనిషి ఒకడు కొల్లాయిగుడ్డతో, రాట్నంతో, కబీరోదోహాతో దాన్ని ఎదిరించాడు. ఇప్పుడు నేను స్వతంత్ర దేశ పౌరుడిగా, భావుకుడిగా, కవిగా నీదగ్గరికి వచ్చాను. నిన్ను చూశాను, ముగ్ధుణ్ణయ్యాను. నీ పావురాలకి గింజలు చల్లిన వాళ్లలో నేనూ ఉన్నాను. సెలవు.


15

A Morning in London

The next morning, when we checked out of the hotel to tour the city, the avenues lay glistening from an early dawn shower. Cherry petals were fluttering in the breeze. The city had not yet shaken off the unhurried slumber of Sunday morning. Walking a short distance, we entered Hyde Park. Vast undulating lawns lay curled softly, soaked by the rain, while tall park trees had yet to feel the awakening touch of spring.

At the renowned Speakers’ Corner, a Christian preacher was delivering a biblical sermon, displaying a placard inscribed in Yiddish with promises of the heavenly kingdom. A cluster of students from continental Europe had gathered around him, mocking the solemn warnings he voiced against worldly life.

We moved on, for countless sights awaited us. We first watched the changing of the guard at the royal palace with all its ceremonial protocol, and then spent some time at Trafalgar Square: the towering monument commemorating Nelson, the great admiral of the Victorian era, flanked by colossal granite lions, with Big Ben rising in the distance and the National Gallery standing alongside. It was right there that Haha Huhu, the celestial gandharva of Viswanatha Satyanarayana, had tumbled down from the heavens to earth!

From there, my companion yearning to see the Koh-i-Noor diamond, we took an Underground train to the Tower of London. It is a fortress, a prison, an execution ground, a royal mint, and an exhibition hall—bearing witness to English history ever since William the Conqueror (1066). Chilling memories cling to its stones: it was here that King Charles I was held before his trial, and here that Thomas More, the visionary who dreamed another world in Utopia, was beheaded, his severed head later displayed upon London Bridge.

Thomas More—a supreme lover of mankind, a humanist, an English Socrates—is said to have advised his executioner upon the scaffold:

“Pluck up thy spirits, man, and be not afraid to do thine office; my neck is very short; take heed therefore thou strike not awry.”

Today, blossoms carpet the outer grounds of that fortress, while within rest the Crown Jewels. Watching the archival documentary of Queen Elizabeth’s coronation as we moved toward the Koh-i-Noor, my feet faltered. That jewel stands as the material embodiment of the poetic line: “The entire history of the human race is drenched in streams of battle-blood.”

Yet how spotless, how pristinely white it gleams! Discovered three centuries ago along the banks of the Krishna River, the diamond passed through the hands of the Golconda Sultans to Shah Jahan. Snatched from the Mughals during Nadir Shah’s invasion, it returned to India, only to be yielded to Queen Victoria by the East India Company following the annexation of the Punjab, thereby entering the royal regalia of the British Crown. As an enduring emblem of violence and bloodshed among men, no king chose to wear it; it came to rest exclusively within the crown of the Queen Mother. Yet our poets continue to glorify the Motherland, singing: “The Koh-i-Noor is the flower tucked into your braid.”

Returning to Trafalgar Square, we walked through St James’s Park to Buckingham Palace and spent some quiet time there. With a light drizzle falling, we stood beneath the sheltering canopy of weeping willows in fresh bloom and took photographs.

The hour was approaching for our return coach. Brushing aside the disappointment of being unable to visit the grave of Karl Marx, I tried to gather and recast my impressions of London.

Remembering Wordsworth’s poem on Westminster Bridge—lines that had awakened no deep echo within me when I first read them—I found them ringing with absolute truth today. The very poet who had lamented the decadence of London in 1802 and invoked the spirit of Milton had, upon Westminster Bridge, composed these lines:

Earth has not anything to show more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This City now doth, like a garment, wear
The beauty of the morning; silent, bare,
Ships, towers, domes, theatres, and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.

Never did sun more beautifully steep
In his first splendour, valley, rock, or hill;
Ne’er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! the very houses seem asleep;
And all that mighty heart is lying still!

Truly, that opening line is best rendered: Earth has nothing fairer to display. There is no falsehood in the poet’s word. In St James’s Park, when the pale green willow boughs drooping over the lake sway in the breeze, when waterfowl ripple the calm water into gentle circles, and when tender Easter rain drifts down from above like scattered pearls, it is impossible not to bow before this radiant earth.

Victorian architecture, with all its monumental pomp, is gathering dust today. London advertises itself from the decks of open-top buses, proclaiming: “Behold how magnificent was my past!” That empire has vanished; those generals are no more. Yet blossoms continue to bloom, and birds continue to take wing. The Nelson monument in Trafalgar Square may crumble tomorrow, but Wordsworth’s poem upon Westminster Bridge will endure forever. Sir Thomas More’s Utopia will inspire human beings toward the ideals of a better world for generations to come.

London! To you I offer my salutation.

When you flaunted the arrogance of your imperial might, a man of ours confronted it armed only with a loincloth, a spinning wheel, and a doha of Kabir. Today, I came before you as a citizen of a sovereign republic, as a thinker, and as a poet. I looked upon you, and I was enchanted.

I too am numbered among those who scattered grain for your pigeons.

Farewell.


Featured image: Photography by Pierre Blache via.pexels.com

17-10-2026

Leave a Reply