నేను కోరుకునేదొక్కటే

అడిగారట ఒకప్పుడొకాయన్ని
సూఫీల గురించి చెప్పమని.1

ఆయనన్నాడట:
మొదట్లో వాళ్ళీ ప్రపంచంలో కుదురుకోలేకపోయారు
కాని మనసులో నిశ్చలంగా ఉండేవారు.
తర్వాత తర్వాత ప్రపంచంతో సర్దుకున్నారు
కాని మనసులో అశాంతిపడుతుండేవారని.

భగవంతుడా!
నేను కోరుకునేదొక్కటే
నాకు ప్రపంచమంటూ
మరొకటి లేకుండా చూడు!


1.Sadi, Gulistan, Darvishan, story no.25

11-12-2025

4 Replies to “నేను కోరుకునేదొక్కటే”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading