కొన్ని కలలు కొన్ని మెలకువలు-10

4

యథాతథవాదానికి ప్రతినిధులు

గిరిజన గ్రామంలో ప్రభుత్వం పాఠశాలని తెరవడమే ఎంతో దుస్సాధ్యమైన పని. అయినా కూడా ఆ పాఠశాల పనిచెయ్యడం లేదంటే అంతకు మించిన విషాదం మరొకటి ఉండకపోదు. ఆ మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల స్ధితిగతుల్ని చూసినప్పుడూ, వారికి కనీస సదుపాయాలూ, సౌకర్యాలూ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడూ కనీసం విద్య అయినా అందితే బాగుండనే ఎవరికన్నా అనిపిస్తుంది.

నేను పుట్టింది గిరిజనగ్రామమే అయినా నాకు గిరిజనాభివృద్ధి గురించి అప్పటిదాకా నాకు తెలియదు. నేను ఆంత్రొపాలజీ చదువుకున్నవాణ్ణి కూడా కాను. నాకు అప్పటిదాకా తెలిసిన రోల్‌మోడల్స్ ఇద్దరే. ఒకరు, తన జీవితకాలం పాటు గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ వచ్చిన నా తండ్రీ, మరొకరు, ఒకప్పుడు రంపచోడవరంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన ప్రముఖ సాహిత్యవేత్త సి.వి. కృష్ణారావుగారూ. నాకు గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం వచ్చిందని తెలియగానే కృష్ణారావుగారు ఉత్తరం రాసారు. ‘ఎ.ఎల్.క్రోబర్ రాసిన ఆంత్రొపాలజీ చదవండి’ అని.

నేను క్రోబర్‌ని మాత్రమే కాక లెవీ-స్ట్రాస్‌నీ, రాబర్ట్ రెడ్‌ఫీల్డునీ, రూత్‌బెనెడిక్ట్‌నీ, ఫ్రాంజ్‌బొవాస్‌నీ కూడా చదివాను. మహత్తరమైన వారి రచనలు ప్రపంచ మానవ విజ్ఞాన శాస్త్రంలో మైలురాళ్లు. అంతదాకా తనే ప్రపంచానికి కేంద్రంలో ఉంటున్నాననుకుంటున్న యూరోప్ కళ్లు తెరిపించిన రచనలు అవి.

కానీ, వాటిలో ఆదివాసుల విద్య గురించిగానీ, వాళ్లకి ఆధునిక విద్యను చేరువ తీసుకువెళ్లాలనుకునే క్రమంలో ఎదురయ్యే వివిధరకాల సమస్యల గురించి గాని నాకేమీ పనికొచ్చేది కనిపించలేదు. అవి శుద్ధసాంస్కృతిక కోణం నుంచి ఎంతో విలువైనవి. కాని ఆదివాసీ జీవితపరివర్తనను అర్ధం చేసుకోవడానికి, ముఖ్యంగా ఆ పరివర్తనను స్ధానిక క్షేత్రంలో పోల్చుకోవడానికీ నాకు ఆ రచనలు ఎకాఎకి సహాయం చెయ్యలేవనిపించింది.

ఆ పుస్తకాలన్నిటిలో సోల్‌టాక్స్ సంకలనం చేసిన ఆంత్రొపొలాజికల్ సర్వస్వంలో  ‘ద ఆంత్రొపొలాజికల్ స్టడీఆఫ్ ఎడ్యుకేషన్’ (1976) అనే పుస్తకం నన్నెక్కువ ఆకర్షించింది. అందులో సంపాదకులు రాసిన సుదీర్ఘమైన పరిచయాన్ని నేను పదే పదే చదివాను. ఆ పరిచయంలో నాకు కనువిప్పు కలిగించిన అంశాలు రెండున్నాయి.

నేను అప్పటిదాకా విద్యకీ, పాఠశాలలకీ గతిశీలత ఉందని భావించేవాణ్ణి. ఆ పుస్తకం చదివాక నా వాస్తవ అనుభవాలు నాకు బాగా బోధపడ్డాయి. విద్యకి గతిశీలత ఉండవచ్చేమో గాని పాఠశాలలు ప్రపంచమంతా కూడా యధాతథవాదానికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాయని బోధపడింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు. అవి అధికారిక భావజాలానికి ప్రాచుర్యం తేవడానికీ, ప్రజలకు అధికారిక నిర్మాణాల పట్ల విధేయతని బోధించడానికీ మాత్రమే పనిచేస్తున్నాయని నేను గ్రహించాను.

మా గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్ధలో సీనియర్ మేధావి, ఇప్పుడు  ఆ సంస్ధకి సంచాలకులుగానూ ఉన్న డా.వి.ఎన్.వి.కె.శాస్త్రి దీన్ని చాలా చమత్కారమైన ఉదాహరణతో వివరించారొకసారి.

సాధారణంగా మనమేదన్నా గిరిజనగ్రామానికి వెళ్తే అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒక విధమైన స్వేచ్చనీ, నిర్భయత్వాన్నీ చూస్తాం. అధికారిక  వ్యవస్ధలతో మాట్లాడుతున్నామన్న బెరుకు వారిలో ఏ కోశానా కనిపించదు. వారిలో హఠాత్తుగా చేతులు కట్టుకుని, నంగిరి మాటలతో మనకి జవాబిస్తున్నట్టు కనిపించారను కోండి. ‘వాణ్ణి ఇట్టే పోల్చేయ్యవచ్చు. కొన్నాళ్లన్నా మన స్కూళ్లల్లో చదివిఉంటాడని’ అంటాడాయన.

మనుషులకు నిర్భయత్వాన్ని నేర్పవలసిన విద్య పర్యవసానం గిరిజన ప్రాంతాల్లో నిర్భయత్వం స్ధానంలో కృత్రిమ విధేయతను ప్రవేశపెట్టడంగా ముగుస్తున్నది.

ఆ ఆంత్రొపొలాజికల్ అధ్యయనాన్ని చదివిన తర్వాత నాకు గిరిజన ప్రాంతాల్లోని విద్యావ్యవస్ధలోనూ, నిర్మాణాలల్లోనూ ప్రగతి వ్యతిరేక అంశాలు, సాంస్కృతిక వ్యతిరేక అంశాలూ, జనజీవితానికి సంబంధం లేని అంశాలూ విస్తారంగా ఉన్నాయని బోధపడింది. ఇది మొదటి కనువిప్పు కాగా, అటువంటి విద్యావ్యవస్ధను తమకి తెలీకుండానే గిరిజనులు తిరస్కరిస్తున్నారనీ అందుకే గిరిజన ప్రాంతాల్లో విద్యాలయాలు పనిచెయ్యలేకపోతున్నాయనీ గ్రహింపుకు రావడం రెండవది.

నేను నా ఉద్యోగ జీవితంలో భాగంగా ఆ పాఠశాలల చుట్టూ పరిభ్రమిస్తుండగానే నూతన విద్యావిధానం గురించిన చర్చ కూడా నెమ్మదినెమ్మదిగా ప్రసరిస్తూ ఉండింది. 1986లో ప్రకటించిన జాతీయ విద్యావిధానం మీద కొత్తగా నేనేమీ ఇక్కడ విమర్శించాలనుకోవడం లేదు. దాదాపుగా గత ఇరవయ్యేళ్లుగా దానిమీద విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉంది.

దాని మీద శక్తివంతమైన, అర్ధవంతమైన విమర్శలు ఎన్నో వచ్చాయి. తమ విస్పష్టమైన నిరసనల్ని ఎందరో విద్యావేత్తలు ప్రకటించే ఉన్నారు కూడా. నేను మూడు అంశాల్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను.

మొదటిది, ఆ పత్రంలో పూర్తిగా దార్శనిక స్పష్టత కొరవడింది. 1968 విద్యావిధాన పత్రంలోనయినా ఎంతో కొంత భవిష్యద్దర్శనం, విద్యాదర్శాల నిర్వచనం ఉన్నాయి గాని, ఈ పత్రంలో అటువంటివేవీ కనరావు. అది విద్యనొక క్లరికల్ స్ధాయి అంశంగా, సాంకేతిక అంశంగా భావించిందే తప్ప, సమాజాన్ని మార్చగలిగే గతిశీల శక్తిగా చూడలేదు. అందుకనే ఆ పత్రాలు చదివితే నాకేమీ ఉత్తేజం కలగలేదు. అది నన్ను ముందుకో, వెనక్కో ఊగించలేదు. చలింపచేయలేదు.

రెండవది, అసలు దానిలో సూచన మాత్రంగా కూడా గాంధీజీ ప్రకటించిన బేసిక్ విద్య గురించిగాని, దాని లక్ష్యాల్ని పునర్నిర్వచించుకోవాల్సిన ఆవశ్యకత గురించిగాని చర్చ లేదు. సాధారణంగా అందరూ గాంధీజీ విద్యావిధానమనగానే కాయికశ్రమకి ఆయనిచ్చిన ప్రాధాన్యత గురించే మాట్లాడుతారు. యథార్ధానికి, నాకు అర్ధమయిన దాన్ని బట్టి, దానిమీద కొఠారి కమిషన్ ప్రకటించిన దాన్ని బట్టి, ప్రధానమైంది, పాఠశాలనొక ఉత్పాదకశక్తిగా ఎలా మార్చడమన్నది. ఇక్కడ ఉత్పాదకత అంటే కేవల వస్తూత్పత్తి శక్తి మాత్రమే కాదు. నిజానికి ఉత్పాదకతను వస్తూత్పత్తి శక్తిగానే భావించడం దాన్ని మరీ యాంత్రికంగా అర్ధం చేసుకోవడం మాత్రమే.

ఉత్పాదకత అంటే మానవ సమాజం తనకి అందుబాటులో ఉన్న సమస్త వనరుల్ని, అవి భౌతికంగానీ, మానవసామర్ధ్యాలు, కాలం దేన్నయినా సరే సక్రమంగా సద్వినియోగపరుచుకోవడానికి సంబంధించిన అంశం.

భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది కాబట్టీ, అక్కడ వ్యవసాయమూ, చేతి వృత్తులూ ముఖ్యజీవనోపాధులు కాబట్టీ గాంధీజీ వాటికి సంబంధించిన ఉత్పాదకతను విద్య  ఏ విధంగా ప్రభావితం చెయ్యగలదా అని ఆలోచించారు. ఆ విషయంలో ఆయన మాట్లాడింది మనం ఉదాహరణగా మాత్రమే భావించి దాన్ని మరింత ఏ విధంగా ముందుకు తీసుకుపోగలమా అన్నది ఆలోచించాలి. అంటే మన విద్యా కరికులంకి మనం గతిశీలతనివ్వాలి.

విద్యను గ్రామ సమాజానికి చేరువగా తీసుకువెళ్లాలి అన్నారు గాంధీజీ. నేను గ్రహించినంతవరకు ఇది విద్యా గతితర్కంలో అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన సూత్రం. నూతన జాతీయవిద్యావిధానానికి గాంధీజీ ఇటువంటి మాటలు చెప్పారనే గుర్తులేదు. ఎవరో రిటైర్డ్ ఎన్.సి.ఇ.ఆర్.టి.ప్రొఫెసర్ రాసినట్టుండే ఆ విధాన పత్రానికీ, నేను నా కళ్లతో అప్పుడు చూస్తూ వచ్చిన పాఠశాలలకీ ఏమి సంబంధం లేదు.

మూడవ అంశం, నాకు సంబంధఙంచినంతవరకూ, అత్యంత ముఖ్యమైన అంశం, ఆ విధాన పత్రంలో ఆదివాసుల విద్య గురించి ఎటువంటి చర్చగానీ, దిశానిర్దేశం గానీ లేకపోవడం. సాధారణంగా, కేంద్ర ప్రభుత్వం రూపొందించే విద్యా విధాన పత్రాలన్నిటిలోనూ కొట్టిచ్చినట్టు కనబడే లోపం – దళితుల, ఆదివాసుల, వెనకబడిన వర్గాల శారీరిక వికలాంగుల విద్యలన్నిటినీ ఒక గాటన కట్టడం.

ఇది విద్యకు కూడా వర్తిస్తుంది. బహుశా సంపన్నవర్గాల విద్య విషయం సంపన్న కుటుంబాలన్నిటికీ ఒక్కలానే ఉండవచ్చు. బీదవారి విద్య అలా కాదు. అక్కడ ఎవరి విద్యాసందర్భం వారిది. ఎవరి విద్యావసరాలు వారివి. దళితుల విద్యాసందర్భానికీ, ఆదివాసుల విద్యాసందర్భానికీ వారి పేదరికంలో తప్ప మరెక్కడా పోలిక లేదు.

ఎన్.సి.ఇ.ఆర్.టి. రూపొందించే పత్రాలకు అంత ఓపిక లేదు. అవి విద్య అనేదాన్నొక ఆఖండ బ్రహ్మ పదార్ధంగా భావిస్తున్నట్టే కనబడుతుంది. కాబట్టి ఆదివాసుల విద్య గురించి నాకు ఎదురవుతున్న సమస్యల విషయంలో నిర్దిష్ట పరిష్కారాల్ని గానీ, లేదా ఆ దిశగా నాకెటువంటి గమన నిర్దేశాన్ని గాని జాతీయవిద్యావిధాన పత్రం చూపలేకపోయింది. ఇక నాముందున్న అస్తవ్యస్త పరిస్థితుల్లోంచే నేనేదో దారి నాకై నేను వెతుక్కుంటూ ముందుకు సాగకతప్పదని అర్ధం చేసుకున్నాను.

నిజానికి గిరిజన విద్య ఏ సమస్యల్ని ఎదుర్కొంటోందని నేను భావిస్తున్నానో విస్తృతార్ధంలో ఆ సమస్యలు భారతీయ విద్యమొత్తానికి కూడా వర్తిస్తాయి. అధునిక, అత్యాధునిక విద్య ఎదురుగా భారతీయ విద్య ఎటువంటి స్ధానంలో నిలబడిందో, భారత జాతీయ విద్య ఎదట గిరిజన విద్య కూడా అటువంటి స్ధానంలోనే నిలబడింది. అంటే గిరిజన విద్యాసమస్యల్ని అర్ధం చేసుకున్నట్లయితే, భారత జాతీయవిద్య తన సమస్యల్ని తాను మరింత విస్పష్టంగా బోధపరుచుకోగలుగుతుంది.

దీన్నే మరోలా చెప్పాలంటే, భారత జాతీయ విద్య తనని తాను స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించనందువల్లే దానికి తన దేశంలో సాంస్కృతికంగా అత్యంత విశిష్టమైన ఆదివాసుల సమస్యలు కూడా అర్ధం కాలేదు.

నిజానికి జాతీయ విద్యావిధాన పత్రాన్ని గాని, దాని కార్యనిర్వాహక ప్రణాళికను గాని చూసినట్లయితే, దానిలో పాఠశాలల మౌలిక సమస్య ప్రస్తావన కూడా మనకి కనబడదు. నేనేమనుకుంటానంటే, పాఠశాలల ప్రధాన సమస్య తాము యథాతథవాదానికి ప్రతినిధులు కాకుండా తమ గతిశీలత్వాన్ని ఏ విధంగా కాపాడు కోవాలన్నదే.

చిత్రమేమిటంటే ఈ ఎరుకని అంతర్జాతీయ విద్యాకమిషన్ 1972లోనే చూపగలిగింది. ఇంకా వెనక్కి వెళితే ప్రతి ఒక్క విద్యావేత్తా పాఠశాలల్ని మనం కాపాడుకోకపోతే అది సమాజాన్ని శృంఖలాబద్ధం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నాడు. చలంగారి ‘బిడ్డల శిక్షణ’ లో ఆయన ప్రకటించిన అగ్రహం చూడండి:

ఆధునిక ప్రాథమిక పాఠశాలలకు ఆద్యుడని చెప్పదగ్గ మహనీయ విద్యావేత్త జొహన్ పెష్టలోజీ (1746-1827) కూడా ఈ వైరుధ్యాన్ని గమనించకపోలేదు. ఆయన ఇలా అంటున్నాడు.

తన చిన్ననాటి అనుభవాల గురించి చెప్తూ టాగోర్ కూడా అటువంటి మాటల్నే మరొకసారి చెప్పాడు :

పాఠశాల సమస్య ఏమంటే దానిలో స్వభావరీత్యా పునరావృత్తి తప్పనిసరి. పాఠాన్ని బోధించడంలో, పిల్లవాడికి వివిధ రకాల వాచక, లేఖన అభ్యాసాల్నివ్వడంలో ఒకే అంశాన్ని తిరిగి తిరిగి వల్లె వేయించవలసి ఉంటుంది. చెప్పిన విషయాన్నే తిరిగి తిరిగి చెప్పవలసి ఉంటుంది. పాఠశాల పనిగంటల్లో, పని రుటీన్లలో ఇటువంటి చర్వితచర్వణం కూడా ఒక భాగం.

పునరావృత్తి అన్నంత మాత్రాన అది అనాకర్షంగా ఉండవలసిన అవసరం లేదు. పునరావృత్తిలో రెండు విధాలున్నాయి. ఒకటి యాంత్రిక పునరావృత్తి. అది గానుగకొట్టంలో ఎద్దు తను తిరిగిన దారినే తిరిగి తిరిగి తిరగడం లాంటిది. వస్తువుల్ని తయారుచేసే కార్ఖానాలో అన్ని వస్తువులూ ఒకటే మూసలో బయటకు రావడంలోని పునరావృత్తి అది.

మరొక రకం పునరావృత్తి కూడా ఉంది. తిరిగి తిరిగి సూర్యుడు ఉదయించడం లాంటిది. వెన్నెల వికసించడం లాంటిది. రుతువులు పునఃపునః సంభవించడంలోని పునరావృత్తి అది అక్కడ జరిగిన విషయమే మళ్లా మళ్లా జరుగుతున్నా ఆ జరగడంలో ఎప్పటికప్పుడొక నవత్వముంటుంది. అందుకనే ఒక సూర్యోదయమున్నట్టుగా మరొక సూర్యోదయముండదు. ఈ పునరావృత్తి సృజనాత్మక పునరావృత్తి. యాంత్రిక పునరా వృత్తి కన్నా భిన్నమైంది.

పాఠశాలలు తమ పునరావృత్తి యాంత్రిక పునరావృత్తి కాకుండా సృజనాత్మక పునరావృత్తిగా మార్చుకోవడమెలానా అని ఆలోచించవలసి ఉంటుంది. జాతీయ విద్యావిధానం ఈ ప్రశ్నని ఎదుర్కొని దానికి పరిష్కారానికి అన్వేషించేదిశగా ప్రయాణించవలసింది.

అది ఆ పని చెయ్యలేదు. ఆ పని చేసినవాళ్లు వేరే ఉన్నారు. ఉదాహరణకి, తనొక పాఠశాలని ప్రారంభించాలనుకున్నప్పుడు టాగోర్ దానికి ఋతుసంరంభాన్నే నేపథ్యంగా ఎంచుకున్నారు. నిరంతరం చలనశీలం, సృజనాత్మక పరివర్తన శీలం అయిన ప్రకృతి ఒడిలో తన పాఠశాలని నెలకొల్పాడు. తన అనుభవాల్ని ఇలా చెప్తున్నాడు :


4

Custodians of the Status Quo

Establishing a government school in a remote tribal village is an immensely difficult task in itself. But if that school ultimately fails to function, there can be no greater tragedy. Witnessing the stark living conditions of the tribal people in those interior regions, and seeing their absolute lack of basic amenities and essential facilities, anyone would feel that they should at least be granted the redeeming grace of an education.

Although I was born in a tribal village myself, I knew next to nothing about the structural frameworks of tribal development until then. Nor had I ever formally studied anthropology. Up to that point, my understanding was shaped by just two role models: one was my father, who spent his entire life fighting for tribal rights; the other was C.V. Krishna Rao, a prominent literary figure who had once served as the Project Officer in Rampachodavaram. The moment Krishna Rao learned that I had secured a position in the Tribal Welfare Department, he sent me a letter with a singular piece of advice: “Read the Anthropology written by A.L. Kroeber.”

Following his cue, I immersed myself not only in Kroeber, but also in the works of Claude Lévi-Strauss, Robert Redfield, Ruth Benedict, and Franz Boas. Their magnificent treatises are true milestones in world anthropology—works that shattered the insular worldview of Europe, which had hitherto considered itself the center of the universe. Yet, for all their brilliance, I found nothing in them that was of practical use regarding the education of indigenous peoples, or the complex, multifaceted challenges encountered when attempting to introduce modern education to them. While these texts were incredibly valuable from a purely cultural standpoint, I quickly realized they could not offer immediate, actionable insights into understanding the transformation of tribal life, especially when trying to map that transformation onto the local ground.

Out of all that literature, the book that captivated me most was The Anthropological Study of Education (1976), published within the broader anthropological compendium edited by Sol Tax. I read the editors’ exhaustive introduction over and over again. Two insights within that text brought about a profound awakening in me.

Until then, I had blindly believed that education and schools were inherently dynamic forces for change. Reading that book, however, cast my own field experiences in a clear, sharp light. I began to see that while education itself might possess a certain dynamism, school systems across the globe function primarily as custodians of the status quo. This is particularly true of government schools. I realized that their ultimate function is merely to institutionalize official state ideology and condition ordinary citizens into uncritical obedience toward authority structures.

Dr. V.N.V.K. Sastry, a senior intellectual at our Tribal Cultural Research and Training Institute (TCRTI) who now serves as its Director, once illustrated this systemic reality with a wonderfully witty observation. “Normally, when you visit a tribal hamlet and interact with the folk there,” he remarked, “you witness a beautiful sense of freedom and innate fearlessness in them. They don’t harbor the slightest trace of anxiety or inhibition just because they are speaking to representatives of the state apparatus. But the moment you encounter a tribal man who suddenly folds his hands in subservience and starts speaking to you with absolute timidity—you can identify him instantly. He is someone who has spent a few years studying in our schools.”

Thus, the ultimate consequence of an education that is fundamentally supposed to instill fearlessness in human beings ends up introducing a hollow, artificial obedience in its place within tribal regions. After absorbing that anthropological study, it became clear to me that the educational systems and administrative structures imposed on tribal areas were saturated with anti-progressive and anti-cultural elements—constructs completely divorced from the organic life of the people. This was my first profound awakening. The second was the sudden realization that the tribal communities were, in fact, unconsciously rejecting this alien system; this resistance was the root reason why schools were failing to function in these regions.

As I continued to traverse the circuit of these schools as part of my professional duties, debates surrounding a new educational framework were slowly beginning to circulate. I have no desire to offer any novel criticisms here regarding the National Policy on Education announced in 1986. An extensive and exhaustive discourse has already surrounded it for the past twenty years. Many powerful, meaningful critiques have emerged, and numerous eminent educationists have recorded their explicit dissent. I merely wish to highlight three specific dimensions here.

First, the 1986 policy document completely lacked visionary clarity. The earlier 1968 education policy document possessed, at the very least, a certain foresight and a clear definition of educational ideals; however, no such spirit is discernible in the 1986 formulation. It reduced education to a mere clerical and technical matter, rather than recognizing it as a dynamic force capable of transforming the very fabric of society. That is precisely why reading those policy papers kindled no inspiration within me. They left me entirely cold, failing to stir my intellect or move me in any direction.

Second, the document completely avoided even a passing reference to the Basic Education system propounded by Mahatma Gandhi, or the pressing necessity to redefine its core objectives for contemporary times. Generally, the moment Gandhi’s educational philosophy is invoked, popular discourse focuses exclusively on the emphasis he placed on manual labor. In reality—based on my own understanding and as formally enunciated by the Kothari Commission—the primary thrust of his philosophy lies in how to fundamentally transform the school into a productive force.

Here, productivity does not merely mean the mechanical capacity to manufacture physical goods. In fact, to reduce the concept of productivity strictly to the manufacturing of material items is to misunderstand it in the most rigid, industrial sense.

Productivity, in its true sense, is about how human society systematically and effectively optimizes every single resource at its disposal—whether it be physical assets, human capability, or time itself. Because India fundamentally resides in her villages, and because agriculture and rural crafts constitute the primary lifelines there, Mahatma Gandhi envisioned how education could actively elevate that organic productivity. We ought to view his prescriptions merely as a foundational example, challenge ourselves to take them further, and inject a vital dynamism into our educational curriculum.

Gandhi insisted that education must be brought into intimate alignment with village society. As far as I can perceive, this remains the most critical and potent principle within the dialectics of education. The authors of the new National Policy on Education, however, seemed to have completely forgotten that such a principle ever existed. There was an absolute disconnect between that policy document—which read as though it had been sterilely composed by some retired NCERT professor—and the living reality of the schools I was witnessing with my own eyes.

The third and, to my mind, most crucial point is the total absence of any meaningful discourse or directional guidance regarding Adivasi education within that entire policy framework. This highlights a glaring, recurring flaw in all educational policies drafted by the central government: the reductive habit of lumping the education of Dalits, Adivasis, backward classes, and the physically challenged into a single, uniform category.

Whenever I reflect upon this institutional blindness, the celebrated opening lines of Leo Tolstoy’s novel Anna Karenina vividly come to mind. Setting the stage for his narrative, he writes: Happy families are all alike; every unhappy family is unhappy in its own way.”

This truth applies beautifully to the realm of pedagogy. The educational landscape of the affluent classes may well be uniform across all wealthy families. But the education of the marginalized is entirely different. In their world, every educational context is unique, and every community’s needs are distinctively their own. The educational reality of a Dalit child and that of an Adivasi child share absolutely no structural similarity, save for the common baseline of their material poverty.

The policymakers at NCERT simply lack the patience or nuance to grasp this. They seem to treat education as a monolith—an indivisible, absolute cosmic reality, an Akhanda Brahma Padardham. Consequently, the National Policy on Education utterly failed to offer any concrete solutions to the immediate crises I was confronting in tribal education, nor did it offer a compass for the journey ahead. It became clear to me that I had no choice but to carve out my own path through the chaotic realities that lay before me.

In truth, the specific crises plaguing tribal education are, in a broader sense, a mirror to the structural failures of Indian education as a whole. The exact peripheral position that tribal education occupies in relation to Indian national education is precisely the position that Indian education occupies when confronted by modern and ultra-modern global systems. Ultimately, if we can truly decipher the challenges of tribal education, the Indian national education system will succeed in understanding its own systemic contradictions with far greater clarity.

To state this conversely, it is precisely because Indian national education never attempted to truly comprehend its own internal structures that it proved utterly incapable of understanding the grievances of the Adivasis—the culturally most distinct and vibrant fabric of its own populace. In fact, if one scrutinizes the National Policy on Education or its Program of Action, the most fundamental crisis of the school system is completely bypassed. To my mind, the core dilemma confronting schools today is how to fiercely safeguard their inherent dynamism, rather than allowing themselves to degenerate into custodians of the status quo.

Remarkably, the International Commission on the Development of Education had already illuminated this very awareness as early as 1972. Moving even further back into history, every true educational visionary has warned that if we fail to rescue the school institution, it risks becoming an apparatus that systematically shackles society. Consider the fierce, righteous indignation unleashed by Gudipati Venkatachalam in his seminal work, Biddala Sikshana:

The great educational reformer Johann Heinrich Pestalozzi (1746–1827), who stands as the true pioneer of modern primary education, was acutely aware of this profound contradiction. Addressing this systemic institutional cruelty, he wrote:

Reflecting upon his own childhood miseries, Rabindranath Tagore echoed these very sentiments:

The inherent problem with the institution of the school is that, by its very nature, repetition is unavoidable. In delivering a lesson, or in guiding a child through various reading and writing exercises, the same structural concepts must be revisited over and over again. What has been stated must be reinforced repeatedly. This continuous chewing of the cud forms an inescapable part of the daily school hours and institutional routines.

Tragically, as time wears on, this deadening repetition itself becomes the sum total of the school. It is because it has been subjected to this unfortunate ossification that traditional education has lost both its organic meaning and its vibrant attraction. As the character Girisham sharply observes while satirizing the modern classroom in the classic play Kanyasulkam: “Even now, they make you memorize it blindly like the Vedas, without ever explaining the meaning.”

Yet, simply because learning involves repetition, it does not necessarily follow that it must be sterile or unattractive. There are, in fact, two distinct forms of repetition. The first is mechanical repetition—resembling the blind, circular journey of an ox bound to an oil mill, treading the exact same patch of earth over and over again. It is the mindless duplication of identical objects cast from a singular mold on a factory assembly line.

Within such a system, there is no room for organic growth, no possibility for human development, nor does the rigid architecture allow for any. The structure itself is inherently designed to stunt the spirit. It was precisely this industrial uniformity that Mahatma Gandhi had in mind when he beautifully noted: “I can imagine what trees made by a machine would look like. All their leaves would be exactly the same.”

There exists, however, another distinct form of repetition. It is exemplified by the sun rising day after day, the moonlight blossoming night after night, and the cyclical recurrence of the seasons. Within this realm, even though the exact same phenomenon unfolds repeatedly, every single occurrence brings with it a breathtaking newness. That is precisely why no two sunrises are ever identical. This form of return is a creative repetition, fundamentally distinct from its mechanical counterpart. The core challenge for schools is to figure out how to rescue their institutional routines from deadening mechanical repetition and transform them into this vital, creative recurrence. A true National Policy on Education ought to have confronted this definitive question and steered towards a solution.

But it completely failed to do so. That sacred labor was undertaken by others. For instance, when Rabindranath Tagore resolved to establish a school, he chose the grand festival of the changing seasons as his living backdrop. He anchored his institution deep within the lap of Nature, which is eternally dynamic and creatively transformative. He recounted his experiences thus:


Featured image: Santiniketan at the time of Tagore, pc: Brittanica

15-7-2026

8 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-10”

  1. చాలా ఆలోచింపజేసే వ్యాసం. విద్య అంటే కేవలం పాఠ్యాంశాలు కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే శక్తిని పెంచడం. ముఖ్యంగా గిరిజన విద్యపై మీ విశ్లేషణ ఎంతో విలువైనది.ధన్యవాదాలు సార్

  2. ప్రస్తుత విద్యావిధానం ఎంతో పరిణతి చెందితే తప్ప ఇలాంటి విద్య పిల్లలకు అందుబాటులో వుండదు. NEET వంటి పోటీ పరీక్షల గురించి కూడా మీ విశ్లేషణ తెలుపగలరు.

  3. చదువనేది జీవితమధ్యంలో, జీవితంలో భాగంగా సాగవలసిందే తప్ప, జీవితానికి ఎడంగా, ప్రత్యేకంగా సంభవించ వలసింది కాదనీ, నైరూప్య ప్రక్రియ కాదనీ,….

  4. సర్,
    ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి అవసరమైన చదువు, training తో ఆగిపోకుండా, ప్రపంచ సాహిత్యాన్ని, అప్పటివరకు వెలువడిన ఆంత్రోపాలజీ పరిశోధనలను లోతుగా అధ్యయనం చేసి, ఆ resources లోని limitations నీ, మీ field level అనుభవాలనూ, వ్యవస్థలోని లోటుపాట్లను అర్థం చేసుకుని, వాటి ద్వారా మీరు పొందిన మెలకువలను ఇంత effective గా పంచుకున్న ఈ రచన ఎంతో అమూల్యమైనది.

    “దళితుల విద్యాసందర్భానికీ, ఆదివాసుల విద్యాసందర్భానికీ వారి పేదరికంలో తప్ప మరెక్కడా పోలిక లేదు.”

    మన విద్యా విధానానికీ, curriculum makers కీ పాలకులకీ ఇది ఒక గట్టి చెంపపెట్టు లాంటి statement.

    Equal opportunity in education does not mean imposing same model on every cultural context without proper understanding of the needs of the diverse communities that make up our nation.

    ప్రతి సమాజపు చారిత్రక, సాంస్కృతిక, జీవన వాస్తవాలను అర్థం చేసుకుని, వారి సహజ వికాసాన్ని పెంపొందించే విధంగా విద్యను నిర్మించాలన్నదే ఈ భాగం చెప్పిన అత్యంత విలువైన మెలకువ.
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading