రోజూ జీవించే జీవితమే, కవి చూసినప్పుడు, కొత్తగా కనిపించినట్టే, మనం ఇంతకుముందు ఎన్నో సార్లు, ఎన్నో అనువాదాల్లో చదివిన కవిత్వమే, మళ్ళా కొత్తగా కనిపించడం మంచి అనువాదం లక్షణం.
తుమ్ రాధే బనో శ్యామ్
'ఓ ప్రేమికా, నువ్వు నీ ప్రేయసిగా మారు' అనే మాటలో సముద్రమంత స్ఫురణ ఉంది. కబీరు ప్రేమగీతాల్లోని విరహం, టాగోర్ ప్రేమ గీతాల్లోని వేదన మొత్తం ఒక్క వాక్యంలోకి కుదిస్తే అది 'తుమ్ రాధే బనో శ్యామ్ ..'అనడమే అవుతుంది.
తెగిన బంధనాలు
ఏమైనప్పటికీ, టాగోర్ ని చదవడంలో గొప్ప ఆనందం ఉంది. అది మాటల్లో చెప్పగలిగేది కాదు. నాలుగు అధ్యాయాల ఈ నవల కూడా ఒకగీతం లాంటిదే. టాగోర్ గీతాల్లో సాధారణంగా నాలుగు చరణాలుంటాయి. స్థాయి, అంతర, సంచార, ఆభోగ్ అని. ఈ నవల్లో నాలుగు అధ్యాయాలూ కూడా ఒక గీతంలోని నాలుగు దశలు. నవల పూర్తయ్యేటప్పటికి, ఒక గీతాలాపన పూర్తయిన తర్వాత నిశ్శబ్దమే మనలోనూ మిగుల్తుంది.