నా మిత్రురాలు నన్నట్లా సూటిగా ప్రశ్నించాక ఒక క్షణం ఆలోచించాను. ఆమె చెప్తున్నది సహేతుకమే గాని నేనెందుకలా ఉండలేకపోతున్నాను అని ఆలోచించాను. నా సృజనశక్తుల్ని ఆమె ఆశిస్తున్నట్టుగా, సమాజాన్ని ప్రభావితం చెయ్యడానికి ఎందుకు వినియోగించలేకపోతున్నాను అని నా అంతరాత్మని నేను ప్రశ్నించుకున్నాను.
నవ్యానందం
అనువాదం లానే గానం కూడా ఒక కావ్యానికి కొత్త తలుపు తెరుస్తుంది. అంతవరకూ మనం ఎన్ని సార్లు చదివి వున్నా కూడా మన దృష్టి నిలవని ఏ పంక్తిమీదనో, పదబంధం మీదనో అకస్మాత్తుగా వెలుగు పడుతుంది. మళ్ళా ఆ కావ్యం మనకి మరింత సన్నిహితమవుతుంది.
ఆషాఢ మేఘం -24
ప్రవాసితులందరి హృదయాల్లోనూ గూడుకట్టుకున్న విరహవేదనకి ఆయన తన కవితద్వారా ఒక గొంతునిచ్చాడు. యుగాలుగా అణచిపెట్టుకున్న దుఃఖం ఆయన కవిత్వధారలో జలజలా కురవడం ఈ కవితచదువుతున్నంతసేపూ మనకి తెలుస్తూనే ఉంటుంది. బహుశా, మేఘసందేశం కావ్యానికి ఇంతకన్నా ఘననీరాజనం మరొకరు సమర్పించలేరేమో!
