నేను అప్పటిదాకా విద్యకీ, పాఠశాలలకీ గతిశీలత ఉందని భావించేవాణ్ణి. ఆ పుస్తకం చదివాక నా వాస్తవ అనుభవాలు నాకు బాగా బోధపడ్డాయి. విద్యకి గతిశీలత ఉండవచ్చేమో గాని పాఠశాలలు ప్రపంచమంతా కూడా యధాతథవాదానికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాయని బోధపడింది. ..
మహాప్రస్థానం @75
ఒక్క మహాప్రస్థానగీతాల్లోనే, మనిషి తనతో తాను తలపడటం, మరొకవైపు జీవితపు చేదునిజాల్తో సమానంగా చిత్రణకు వచ్చినందువల్లే దీన్ని ‘కవిచేసే అంతర్ బహిర్ యుద్ధారావం’ అన్నాడు చెలం. మహాప్రస్థానం తర్వాత మరొక మహాకావ్యం తెలుగులో ఇంతదాకా రాకపోవడానికి ఇదే కారణమనుకుంటాను.
విషవృక్షం
అంటే ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ నవల్లో ఒక అభాగినిగా కుంద ఒక్కతే నా హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయిందంటే, ఆ నా పసిమనసుని సంతోషంకన్నా దుఃఖమే ఎక్కువ ఆకట్టుకున్నదని అర్థమయింది. ..
