కవీ, కోకిలా, లోకమూ

కవి కూడా న్యూసుపేపరు చదువుతాడు
సోషలుమీడియా పోస్టులు ఫాలో అవుతాడు
అయినా అతనికెప్పటికీ ఆ భాషపట్టుబడదు
ఎన్నేళ్ళైనా పరాయిభాషగానే మిగిలిపోతుంది.

ఎప్పటికన్నా తమకి పనికొచ్చేలా రాస్తాడా
మహాశయుడని ఎదురుచూస్తుంటుంది లోకం
తననెవరు పలకరించినా, పాపం, వాళ్ళకి
తన అక్షరాలు నేర్పాలని చూస్తుంటాడు కవి.

ఇంతలో కాలనీలో అడుగుపెడుతుంది కోకిల.
రాలిపడ్డ పూలరేకలు కూడా ఆమె గొంతు
వింటూనే పురాతనభాషలో బదులిస్తాయి.
ఇక లోకం కేసి చూడమన్నా చూడడు కవి.

31-3-2026

5 Replies to “కవీ, కోకిలా, లోకమూ”

  1. తరచి లోకాన్ని చైతన్య పరచు కొఱకె
    కవి బతికి తీరవలె , యట్లు గాక , తనకు
    అసలు లోకముతో పని పొసగకున్న
    లోకము నకును కవితోటి పోక డేల ?

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading