గురుస్థానం

అందుకనే ఈ తరాలకు చెందిన యువతీ యువకులు పాల్గొనే ఏ సాహిత్యసమావేశానికిగాని, లేదా ఏ వర్క్ షాప్ కి గాని వెళ్ళాలంటే నాకెంతో ఉత్సాహంగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ప్రతిభావంతుల్ని సినిమా ఇప్పటికే తన కబంధహస్తాల్తో దగ్గరకు లాక్కుంటోంది. ఆ పట్టుకి చిక్కకుండా ఎవరు మిగిలినా వారిని సాహిత్యం పేరుచెప్పి కాపాడుకోవాలనిపిస్తుంది.