ఎన్నేళ్ళుగానో విన్న కవిత్వాలు, మనకి బాగా పరిచయమైన కథానాయికలు, నాయకులు, చిరపరిచితమైన లాండ్ స్కేప్-కాని ఉషాజ్యోతి బంధం కవిత్వంలో మనకి కనిపించినప్పుడు, మనం ఆ లోకాన్ని విస్మరించితిరుగుతున్నామనీ, ఒక క్షణం అన్నీ పక్కనపెట్టి, ఆ చెట్టుకింద, ఆ ఋతువులో, ఆ పాట వినడంద్వారా మనం మనకి మరింత చేరువకాగలమనీ అనిపిస్తుంది.