సాహిత్యం, సృజన నీలోని అద్వితీయతను వెలికి తీస్తాయి

నీలో నీదే అయిన ఆ ప్రత్యేక లక్షణాన్ని నువ్వు గుర్తుపట్టుకోవాలి. దాని ఆధారంగా నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ ప్రయాణానికి సాహిత్యం, సృజనాత్మక కార్యకలాపం సాయం చేసినంతగా మరేమీ సహకరించలేవు.