పాలమూరు అడవిదారిన-1

‘అడవిమీద కాసిన వెన్నెల వృథాకాదు, అదే అత్యంత ఫలవంతమైన వెన్నెల’ అన్నారు వీణావాణి. ‘పండ్లలో రసం, కంకుల్లో పాలు, గింజల్లో పుష్టి ఊరేదంతా వెన్నెల్లోనే’ అన్నారామె.