'మహాభారతంలో మనుషులు ఎదుర్కొన్న కొన్ని సంక్షోభాలే' తన నవలకి ఇతివృత్తమని నాయర్ చెప్పుకున్నాడు. అంత విస్తారమైన గ్రంథంలో కూడా కృష్ణద్వైపాయన వ్యాసుడు మౌనం వహించిన కొన్ని తావుల్ని తాను పట్టుకున్నాననీ, ఆ తావుల్ని తనకు విడిచిపెట్టినందుకు వ్యాసుడికి ప్రణమిల్లుతున్నాననీ కూడా రాసుకున్నాడు.