GOLCONDA

1992నుంచి 2000 మధ్యకాలంలో ఉద్యోగ జీవితం నన్ను పూర్తిగా ఆవహించడంతో ఆ కాలమంతా కవిత్వానికి దూరంగా బతికాను. అడవుల్లో, కొండల మధ్య, వెన్నెలరాత్రుల్లో, ఉదయాస్తమయాల సౌందర్యశోభని చూస్తూ గడిపిన ఆ కాలంలో ఎంత కవిత్వం వచ్చి ఉండాలి? కాని మనసు ఒక పాత్ర లాంటిది. దాన్ని ఒక్కసారి ఒక్క ద్రవ్యంతో మాత్రమే నింపగలం.
 
2000 లో హైదరాబాదు వచ్చిన తరువాత నా కవిత్వసాధనలో రెండవ దశ మొదలయ్యిందని చెప్పవచ్చు. 2001 లో ఒకసారి గోల్కొండ వెళ్ళినప్పుడు ఒక కవితరాసాను. దాంతో మరొక ప్రయాణం మొదలయ్యింది.
 
 
గోల్కొండ
 
చెక్కు చెదరని పదాల్లో ఎవరూ కాపురముండరు.
పరిణతి చెందిన శబ్దాలు రాళ్ళుగా గోళాకృతిలో
ఒకదాన్నొకటి పెనవేసుకుంటాయి
పూర్తి అర్థంలో వికసించిన ఒక పద్యం నుండి
జనావాసం దూరంగా జరిగిపోతుంది.
 
ఒక స్మృతిగా, గోపురంగా మిగిలిపోయే పదాల్ని పట్టుకుని
కొన్ని సంకేతాలూ, కొన్ని పక్షులూ మాత్రమే వచ్చిపోతుంటాయి.
 
నేను నా జీవితాన్ని పునః ప్రారంభించాలనుకున్నప్పుడు
ఒక విరిగిన పదం ఆసరగా నా అంగాగాల్నీ కూడదీసుకున్నాను.
పరిశోధకులు మాత్రమే నడుస్తున్న నేలమీద
దుమ్ము కూడా చెలరేగని నిర్లిప్త ప్రశాంతతని
పాకుతూ ఆవరిస్తున్న పచ్చిక చెరిపెయ్యడం చూసాను.
అమీర్ ఖుస్రో గజల్ చుట్టూ ఒక సాలీడు గూడు అల్లుతోంది,
మనుషులు వదిలిపెట్టినా సంధ్యారశ్మి ఎవరినీ వదులుకోదు.
 
నిర్జనంగా ఉన్నాయనుకున్న మృతశబ్దాల చుట్టూ ఒక హోరు,
మనకి పరిచయమైన అర్థాల్ని మర్చిపోయినప్పుడే ఆ హోరు వినగలం.
మధ్యాహ్నపు ఎండ ఎండగా ఉండగానే ఒక చిరుజల్లు తడిపిపోయింది.
చతురస్రాకారపు మాటల పైన తేమనీడలు పరుచుకున్నాయి
తమని వదిలిపెట్టిపోయిన సహచరుల్ని పాతిపెట్టినట్టు
పదాల్ని అక్కడ నిక్షిప్తం చేసారు.
 
మట్టిలో కలిసిన ప్రతి పదమూ
తిరిగి ఒక కొత్త అర్థంగా మొలుస్తుంది.
 
2001
 
GOLCONDA
 
A flawless word cannot house anyone forever.
Words solidify and calcify as they mature.
From a poem that blossoms in its meaning completely,
People move away.
 
In the void of words, only symbols and birds remain.
 
I leaned on a broken word to rebuild my life.
When scholars swarm a land,
The grass smears away any remaining silence.
Around a niche carved with ghazals by Amir Khusro,
A spider weaves its web.
Although people may abandon you, the sun will shine.
 
While the words appear dead,
There is a whipping roar around them.
When their meanings become unfamiliar,
They return to life.
It drizzled in the afternoon, and
The rectangular words became wet.
As if burying the dead friends who left them,
They have buried words there.
 
Whenever a word falls to the ground,
It sprouts back with a new meaning.
 
8-9-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%