ఆ నిర్మల చంద్రకాంతి

అందులోనూ ఆ పిల్లలు పల్లెలనుంచి పట్టణాలకీ, నగరాలకీ పై చదువులకోసమో, బతుకు తెరువు కోసమో అడుగు పెడుతున్నట్లయితే, వాళ్ళ సున్నితమైన మనసులు ఆ సమయాల్లో ఎటువంటి దారుణవేదనకి గురవుతాయో చెప్పడానికి మాటలు చాలవు.

ఆయన మామూలు కవి కాడు

ట్రాకల్ కవిత్వ అనువాదకుల్లో ఒకడైన జేమ్స్ రైట్ దాన్ని 'ఓపిక పట్టడం' అన్నాడు. ట్రాకల్ అర్థం కావాలంటే మనం ఓపిగ్గా ప్రతీక్షించవలసి ఉంటుందన్నాడు. మా మాష్టారు దాన్నే కవిత ప్రసన్నం కావడం అన్నారు. నీకు ఒకపట్టాన ప్రవేశం దొరకని కవిత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే ఒక దగ్గరి దారి నువ్వు ఆ కవిత్వాన్ని నీ మాతృభాషలోకి అనువదించుకోవడం. నేనూ ఆ ప్రయత్నమే చేసాను. ట్రాకల్ ఇన్నాళ్ళకు నా పట్ల ప్రసన్నుడయ్యాడు.