కథాశిల్పం-4

కాబట్టి పై మూడు నిర్వచనాల్నీ కూడా మనం ఒక నిర్వచనంగా మార్చుకోవచ్చు. అదేమంటే, సార్వత్రిక నిర్మాణాలకో, సాంస్కృతిక నిర్మాణాలకో అనుగుణంగా వివిధ సంఘటనల్ని గుదిగుచ్చి చెప్పడం ద్వారా వాటిలోని అంతర్గత విశేషాలను తేటతెల్లం చేస్తూ, వాటిని ఒక కథగా మార్చడమే కథన ప్రణాళిక.