శీతాకాలం రాగానే పుస్తకాల పండగలు మొదలవుతాయి. కాని ఈ సారి పండగ అందరికన్నా ముందు నిన్న మా ఇంట్లోనే మొదలయ్యింది. జీవితాన్నీ, మనుషుల్నీ, ప్రపంచాన్నీ ప్రేమించే కొద్ది మంది మిత్రుల మధ్య నిన్న కొన్ని పుస్తకాలు ఈ లోకంలోకి దిగి వచ్చాయి
పాటలు పుట్టిన తావులు
జీవితసౌందర్యాన్ని మాటల్లోనూ, రంగుల్లోనూ పట్టుకోవడమెలానో కొంత సాధన చేసానుగాని, రాగాల్లో కనుగొనడమెట్లానో ఇంకా జాడతెలియడం లేదు. భగవత్కృప నా జీవితంలో సంగీత రూపంగా ఇంకా అనుభవంలోకి రావలసి ఉంది.
