ఏమై పోయాయి ఆ పద్యాలు?

ఎటువంటి పద్యం! ఎటువంటి ఛందస్సు! పండరంగడు జైనుడు. తెలుగుని పద్యభాషగా తీర్చిదిద్దినవాళ్ళూ, తెలుగు ఛందస్సు రూపకర్తలూ జైనులే అనడంలో సందేహం లేదు. ఏమై పోయాయి ఆ పద్యాలు? ఆ కావ్యాలు? ఎక్కడ అదృశ్యమైపోయారు ఆ రసజ్ఞసమూహాలు?