అతులిత మాధురీ మహిమ

ముఖ్యంగా మాధుర్యమంటే సర్వావస్థామనోహరత్వం అని అంటారని చెప్తూ ఆ సర్వావస్థామనోహరత్వం ఆ కావ్యంలో ఎలా ఉందో కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆయన చెప్పినదాన్ని బట్టి ఆ కావ్యమాధుర్యం ఎక్కువగా మన మననశీలత మీద ఆధారపడ్డదని అర్థమవుతూ ఉంది.

భగవంతుడి లేఖకుడు

భగవత్ప్రేమని అనుభూతిచెందడం, దాన్ని ఉక్కులాంటి భాషలో కరిగించి పోతపొయ్యడం, తద్వారా తక్కినవాళ్ళు కూడా ఆ ప్రేమానుభూతికి పాత్రులయ్యేలా చూడటం అతడి ఉద్దేశ్యం. అతడి దృష్టిలో కవిత్వం కేవలం భగవంతుడి కోసమే ఎందుకంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటీ సర్వేశ్వరుడి కోసమే కాబట్టి.