రవీంద్రకుమార శర్మ గారితో 2010 లో నేను చేసిన సంభాషణల్ని జీవనశిల్పి పేరిట మీతో పంచుకున్నాను. ఆ సంభాషణల్ని పుస్తక రూపంగా కూడా ఈ-బుక్ గా మీతో పంచుకున్నాను. శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు ఆ సంభాషణల్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ రోజు సాయంకాలం అదిలాబాదులో కళాశ్రమంలో ఆ పుస్తకాన్ని గురూజీ శ్రీమతి రాజశ్రీ శర్మగారు ఆవిష్కరిస్తున్నారు.
రావిశాస్త్రి వారసులు
ఈరోజు రావిశాస్త్రి గారి 104వ జయంతి సందర్భంగా—స్వర్ణ కిలారి, నరేష్ కుమార్ సూఫీ, మహమ్మద్ గౌస్, చరణ్ పరిమి గార్లకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు మొత్తం 15 మంది రచయితలకు ఈ పురస్కార గౌరవం దక్కింది.
అనిల్ బత్తుల మధుశాల
ఈ పొయెట్రీలో మొత్తం కవితలన్నీ కూడా చాలా స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా, అనవసరమైన అలంకారాలు లేకుండా, భేషజాలు లేకుండా, "దీన్ని కవితగా మార్చాలి" అనే తాపత్రయం లేకుండా ఉన్నాయి. బహుశా నేను రాశాననుకోండి, "దీన్ని కవితగా ఎలా మార్చాలి, ఎలా చెక్కాలి" అనే తాపత్రయం ఉంటుంది. ఆ బాధలేమీ లేకుండా సూటిగా, నేరుగా అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు.
