శివ సంకల్ప సూక్తం

కార్తికమాసం మొదలవుతున్న ఈ ప్రత్యూషవేళ నా తలపులూ, మీ తలపులూ కూడా శివ సంకల్పమయం కావాలనే శుభాకాంక్షతో ‘శివ సంకల్ప సూక్తం’ పైన నా ప్రసంగాన్ని మీతో పంచుకుంటున్నాను. నలభైనిమిషాల ప్రసంగం. మీకు వీలున్నప్పుడు వింటారని కోరుకుంటున్నాను. ఈ ప్రసంగాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే పక్కన మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

14-11-2023

21 Replies to “శివ సంకల్ప సూక్తం”

  1. చాలా బాగుంది గురువు గారు
    పూజ చేసేటప్పుడు సంకల్పం
    పాఠ్య ప్రణాళిక రాసేటప్పుడు లక్ష్యాలు అన్ని శివ సంకల్ప స్వరూపలే అని గ్రహించాను

    పోకూరి శ్రీనివాసరావు

  2. మీ మాటలతోనే నాకు కార్తీకమాసం మొదలైంది గురువుగారు , ధన్యవాదాలు 💐

  3. చిన్నప్పుడు కార్తీక మాసం అమ్మ గోదావరి నదికి సమర్పించిన దీపాలతో మొదలయ్యేది. ఈసారి మీ సంకల్ప సూక్తం తో మొదలయింది ! శుభారంభo! 🙏

  4. ఇంత మంచి ప్రయోజనకరమైన ,స్ఫూర్తిదాయకమైన ప్రసంగం నేనెనప్పుడు వినలేదు. మీ సాంగత్యం ఆ శివ సంకల్పంగా తలుస్తాను.మీ లోని ఉపనిషన్మూర్తికి సాష్టాంగంగా ప్రణమిల్లుతున్నాను.

  5. నమస్తే సర్, ఎంత గొప్పగా ఉందో..ధన్యవాదాలు సర్

  6. విన్నాను పూర్తిగా…. విన్న తర్వాత నాకెంత అర్థమైంది తెలియదు కానీ మనసు నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకున్నట్టుగా ఉంది…
    చాలా నచ్చింది ఒక అందమైన బహుమతి ఇది…

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading