
నిండుగా పూసిన ప్రతి మామిడి చెట్టూ
నేను పోగొట్టుకున్నది
నిజంగా పోగొట్టుకోలేదనే చెప్తుంది.
మాఘమాసం రాగానే
కిందటేడాది ఎక్కడ వదిలిపెట్టానో
ఆ కవితలక్కడే కనిపిస్తాయి.
మునుపెన్నడో ఒక కథలో చదివామే
గంగానదిలో ఒక కంకణం పోగొట్టుకున్న చోటనే
రెండో కంకణం కూడా దొరికినట్టు
అప్పుడు సగంలో ఆగిపోయిన చరణానికి
ఇప్పుడు రెండో చరణం తోడై దొరుకుతుంది.
eemaata.com వారికి, మిత్రుడు వాసుకి ధన్యవాదాలతో. ఫిబ్రవరి పత్రిక ఈ రోజే విడుదలయ్యింది. ఎన్నో ఆసక్తికరమైన శీర్షికలున్నాయి. చూడగలరు.
1-2-2026


శ్రీనివాస్ గారు పంపగానే చూసాను. ఇక్కడ నిండుగా పూసిన ఓ మామిడి చెట్టును సాయంత్రపు నడకలో చూస్తూ మిమ్మల్ని ఎన్నిసార్లు తల్చుకుంటానో ఎప్పటికైనా మీకో కోకిల చెప్తుందా.. ❤️
పూసిన మామిడి చెట్టు మిమ్మల్ని గుర్తు చేస్తుందని మీకు ఇలా కాక మరోలా ఎలా చెప్పటం!
❤️☺️