
ఈ మధ్య పొడపాటి అశోక్ అనే నా మిత్రుడు నా బ్లాగు చూస్తూ, ‘మీరు ఎన్నో ప్రక్రియల్లో రచనలు వెలువరించారు కదా, ఫిల్మ్ రంగంలో మీ రచనల్తో ఒక పుస్తకం ఎందుకు వెలువరించకూడదు’ అని అడిగాడు. అంతేకాక, పాతాళభైరవి మీద నేను ఎప్పుడో రాసుకున్న వ్యాసం వాట్స్ అప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతూందనీ, అది చదివినవాళ్ళు నేను సినిమాల మీద ఇంకా ఏమన్నా రాసానా అని అడుగుతున్నారనీ కూడా రాసాడు.
ఆయన మాటలు విన్నాక ఈ పదేళ్ళుగా చలనచిత్రాలమీద నేనేం రాసానా అని చూస్తే 34 సమీక్షలు కనబడ్డాయి. వాటితో పాటు ఎడిటింగ్ మీద వచ్చిన ఒక పుస్తకం మీద రాసుకున్న సమీక్ష కూడా కనిపించింది. దాంతో ఆ 35 వ్యాసాలూ ఇలా గుదిగుచ్చి ‘ఇన్విక్టస్ మరికొన్ని సినిమాలు’ పేరిట ఇలా ఈ బుక్ గా అందిస్తున్నాను. ఇది నా 53 వ పుస్తకం.
ఇది మీకు నా కొత్త సంవత్సరం కానుక. మీరు కూడా మీ మిత్రులతో ఈ కానుకని పంచుకుంటారని ఆశిస్తున్నాను.
మా సాయిప్రమోద్ కి దీన్ని ప్రేమతో కానుక చేస్తున్నాను.
30-12-2024


ధన్యవాదాలు సర్ .
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.💐
గౌరవ మిత్రులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారికి ధన్యవాదాలు.
ఆత్మీయులైన మీకు
నవ్యవత్సర మందు నానందమొంద
మీకు నా శుభాకాంక్షలు మేలుకలిగి
సుఖములు బడయగలరు విముఖత లేక
కాలమనుకూలమై యుండు గాక సతము
2025 అంతర్జాతీయ నూతన వత్సర శుభాకాంక్షలు.
డా. పి బి డి వి ప్రసాద్
హృదయపూర్వక ధన్యవాదాలు సార్! మీకూ, మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.💐
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిక నొకటి కలదా..
ఇప్పటి నా ఆనందాన్ని పూర్తిగా వ్యక్తం చేసే భాష నా దగ్గర లేదు సర్.. అడిగిందే తడవుగా శ్రమకోర్చి పుస్తకాన్ని వెలువరించారు.. కొత్త సంవత్సరం ఇంత సంతోషంతో మొదలవుతుంది అని అనుకోలేదు.. ఏమిచ్చిన తీర్చుకోలేని ఋణానికి, ఇప్పటికి మాత్రం చెప్పగలింగింది ఒక్కటే సర్.. “thanks a lot..”
హృదయపూర్వక ధన్యవాదాలు అశోక్! మీకూ, మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.💐
Gd mrng sir
Very very happy new year sir
Next book enti sir
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.💐
కొత్తసంవత్సరానికి ఎంత కొత్త కానుక ఇది!! ఒక్కో పుస్తకం కళ్ళకద్దుకుని చదువుకునే భాగ్యం కలిగింది నాకు 🙇🏻♂️💐🙏
నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువుగారు 💐
ధన్యవాదాలు సోమ భూపాల్!