బసవన్న వచనాలు-3

1924 లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభకి అధ్యక్షత వహించిన మహాత్మాగాంధి తన ప్రసంగంలో బసవన్న నడయాడిన ఆ ప్రాంతంలో బసవన్న చెప్పినదానికన్నా అదనంగా తనేమీ చెప్పలేననీ, నలుగురూ ఆ బోధల్ని పాటిస్తే చాలనీ అన్నారు!

బసవన్న వచనాలు-2

బసవన్న తన వచనాల ద్వారా షట్-స్థల జ్ఞానం కలుగుతుందని చెప్పాడు. షట్-స్థలాలు అంటే ఆరు స్థలాలు. ఇక్కడ స్థలం అంటే ప్రదేశం అని కాదు. అది ఒక మానసిక దశ. ఆధ్యాత్మిక సాధనలో భక్తుడు నెమ్మదిగా పయనించే ఒక్కొక్క ఆవరణ.

బసవన్న వచనాలు-1

ఆ వచనాలు చదువుతూ ఉండగానే నేను నా మనసులో నా మాటల్లో తెలుగు చేసుకుంటూ ఉన్నాను. కబీరు పదాల్లాగా , గీతాంజలి లాగా , జిబ్రాన్ ప్రొఫెట్ లాగా బసవన్న వచనాలు కూడా ఎవరికి వారు తమకోసం మళ్ళా అనువదించుకోవలసినవి. మళ్ళా తమ మాటల్లో ఆ అమృతాన్ని నలుగురితో పంచుకోదగ్గవి.