బసవన్న వచనాలు-5

ఎన్నో వందల ఏళ్ళ తరువాత గాంధీగారు కూడా ఇదే అభిప్రాయానికి చేరుకున్నారు. కాని ఆయన తన జీవితకాలంలో తననొక నేతపనివాడుగా చెప్పుకున్నారు. మరొక జన్మంటూ ఉంటే ఆ జన్మలో తాను దళితుడిగా పుట్టాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. కాని ఎనిమిది వందల ఏళ్ళకి ముందే బసవన్న తన జీవితకాలంలోనే తాను మానసికంగా దళితుడిగా మారగలిగాడు.