
బసవపురాణాన్ని పరిచయం చేస్తూ వచ్చిన ప్రసంగాల్లో పదవ ప్రసంగం. చివరి ప్రసంగం. తెలుగు కవిత్వాన్ని ప్రజలకు సన్నిహితంగా తీసుకురావడానికి సోమన ఎటువంటి కావ్యశైలిని నిర్మించుకున్నాడో ఆ విశేషాల్ని వివరించడానికి చేసిన ప్రయత్నం.’ ఉరుతర గద్యపద్యోక్తులకంటే సరసమై పరగెడు జానుతెనుగు’లో సోమన బసవపురాణాన్ని ఎలా నిర్మించాడో కొన్ని ఉదాహరణలిస్తూ చేసిన ప్రసంగం.
Featured image: Shiva’s Twilight Dance, Himachal Pradesh Miniature, 18th century, PC: Wiki Commons
24-11-2023


అలా ఎలా ముగిస్తారు…బసవుడి కథ పూర్తి కాలేదుగా…బసవుడు శివ భక్తులతో కలిసి విషాపానం చేసిన తర్వాత ఏమి జరిగింది? ముక్కంటి చూస్తూ ఉండిపోయాడా?? మాకు చెప్పాల్సిందిగా ప్రార్ధిస్తున్నాను…
తప్పకుండా చెప్తాను
“అల్పాక్షరముల అనల్పాపార్థ రచన కల్పించుటయె కాదె కవి వివేకంబు”
“సకల పురాతన భక్త గీతార్థ సమితియె మాతృక కాగ పూరితంబైయొప్పు పూసల్లో దారంబు క్రియ”
అంటూ పండితులకే కాకుండా ప్రజలకి చేరువ కాగలిగిన “జాను తెలుగు” లో ఆనాటి “ఉరుతర గద్యపద్య” రచనా శైలికి తిరుగుబాటుగా సోమన చేసిన రచనల గురించి, ఇంకా ఆనాటి చారిత్రక నేపథ్యం గురించి, వివిధ కవుల ( నన్నయ, తిక్కన) కావ్య రీతుల గురించి వివరించి ఆ context set చెయ్యడం వలన, సోమన వాడుకున్న ఈ ద్విపద కావ్య శైలిని ఎందుకు వాడుకున్నారో, ఏవిధంగా భాషని democratize చేసి సామాన్యులకి అర్థమయ్యే విధంగా “సర్వసామాన్యం”గానూ, వేదమంత్రాలకి ధీటుగానూ రచించిన ఘనతని మరింత appreciate చెయ్యగలిగి అవకాశం కలిగింది. 🙏🏽
“హళేబీడు దేవాలయంలో శిల్పాలను వెన్నతో చెక్కారేమో” అన్న మాట చాలా బావుంది, సర్.
ధన్యవాదాలు మాధవీ
“Enjambment” effect ద్వారా 800 యేండ్లకు పూర్వమే కావ్య నియమాల్ని ఉల్లఘించి బసవన్నను చూడడానికి ఆ స్త్రీలు పడిన ఆ హడావిడిని చెప్పడానికి సోమన కవి వాడిన ద్విపద కళ్ళకు కట్టినట్లు వుంది.
బాపురే బసవ కవితలో “బాపురే” అన్న పదానికి అర్థం వేరే ఏదైనా వుందా సర్? ఉర్దూ influence తో వాడిన పదమా? అయితే సోమన కాలానికే ముస్లిం rule ఆ ప్రాంతాల్లో లేదేమో కదా?
“వడిబారు జలమునకొడలెల్లగాళ్ళు
వడిగారుచిచ్చునకొడలెల్ల నోళ్ళు
వడివీచుగాడ్పులనకొడలెల్ల తలలు
వడిజేయు బసవ నీకొడలెల్ల భక్తి”
— stunning వర్ణన. Wah!! Thank you sir, for drawing attention these incredible lines. Cannot appreciate enough these lines and your direction and guidance to stop here and take note.
చిత్తరువుకి జీవం వచ్చినట్లు
చెరకున పండు పసిడి కమ్మదనము
పసిడి పుత్తళికిని ప్రాణము వచ్చినట్లు
— these are beautiful lines
భక్తి కవిత్వానికీ శిల్ప కవిత్వానికీ తేడాలు చెప్పి సోమన ఎంచుకున్న కవితా రీతిని ఎలా appreciate చెయ్యాలో చెప్పిన సుబ్రహ్మణ్యంగారి మాటలు made a lot of sense after listening to your talks and explanations, sir.
“గెలుపు భక్తునకిచ్చి తానోడు బాస”
శివశరణులకు దసోహమయ్యిన బసవన్నకీ 🙇🏻♀️
కావ్యకర్త పాల్కురికి సోమనాథ కవికీ🙇🏻♀️
ఇంత శ్రమ తీసుకుని ఇంత detailed తెలియజేసిన మీకు పాదనమస్కారాలు 🙇🏻♀️
ధన్యవాదాలు మాధవీ! పరిపరి.