కానీ ఇక్కడ ఈ సూక్ష్మవిశేషాలన్నిటితో కూడా ఆ శిల్పాలు గాల్లోకి రెక్కలు చాచుకుంటూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పంచతంత్ర కథలో పావురాలు వలతో సహా ఎగిరిపోయినట్టుగా ఆ శిల్పాలు ఆ మొత్తం తోరణశిలతో సహా గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇది కదా శిల్పమంటే! ఇది కదా కళాసృష్టి అంటే! ఇది కదా సౌందర్య దర్శనమంటే!
