
అరకులోయ దారుల్లో
1
నీ స్వగృహానికి అతిథిగా
ఆంధ్రాయూనివెర్సిటీ ఆర్ట్స్ కాలేజి 62-ఎ గాలరీ కారిడార్‌లో నిల్చున్నాం నేనూ, ప్రకాష్, ప్రశాంతీను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్లో చివరిపేపరు అప్పుడే రాసి బయటకు వచ్చాం. రెండేళ్లుగా విశ్వవిద్యాలయంలో గడిపిన జీవితానికి ఇంక వీడ్కోలు మొదలైనట్టే. ముగిసిపోతున్న ఈ ఉల్లాసభరిత జీవితపు మిలమిల అక్కడ అందరి మనసుల్లో, దాన్ని వెన్నంటే దిగులు. ఇంతదాకా మేం అనుభవించిన జీవితపు జ్ఞాపకాలన్నీ ఊరేగింపులాగా తోసుకొచ్చాయి.
ఎగిసిపడే సాగరతరంగాల్లో మెరిసే సంధ్యాసమయపు బీచ్, కాళీమందిరం ముంగిట్లో ప్రార్ధనలు, రామకృష్ణమఠంలో నెలకొనిఉండే అనిర్వచనీయ (ప్రశాంతి, మహారాణీపేటలో మా లేడీస్‌హాప్టల్లో కలకల్లాడే రోజులు, జగదాంబసెంటర్ నుంచి మెయిన్ రోడ్ పొడవునా తళతళ్లాడే మెట్రొపోలిటన్ విపణి.. ఏవేవో జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూండగా, గడచిపోయిన ఆ రోజులన్నిటినీ మళ్లా ఒక్కసారి, జారిపోయే నదీజలాన్ని దోసిట్లోకి తీసుకున్నట్టుగా, అందుకోవాలని, హృదయానికి బలంగా హత్తుకోవాలని కోరిక, నిశ్శబ్దమధురంగా ఉన్న ఆ కొద్ది క్షణాల్లోనే మమ్మల్ని చుట్టుముట్టిన మా మిత్రబృందం అంతటిలోంచీ ఎవరినుంచో ప్రపోజల్:
‘వెళ్లిపోయే ముందొక్కసారి అరకులోయ వెళ్లామర్రా’.
అరకు పేరు వినగానే నా కళ్లముందు విస్తారమైన ఆకుపచ్చదనం, ఆ పైనంతా నీలిమ అల్లుకున్న గాఢమైన వర్ణదృశ్యం కదలాడింది. ఆ దృశ్యంలో ఏవేవో పువ్వులు, పాటలు, కొండలోయల్లో గిరిజనులు చేసే సామూహికనృత్యాలు రెపరెపలాడాయి. ఈ అసొసియేషన్స్ ఏ సంభాషణల్లోంచో, ఎప్పుడెప్పుడో చూసిన ఏ చిత్రాల్లోంచో పోగుపడ్డవి గావును. లేదా ఎవరెవరో చెప్తున్న విశేషాల్లోంచో నా మనసు నాకు తెలీకుండానే ఏరుకుని చిత్రించుకున్న మెరుపుల మాలికలు కావచ్చును.
‘అరకు ఏం చూస్తామర్రా, మరేదన్నా ఆలోచించండి’ అని ఎవరో ప్రతిపాదిస్తుండగానే అప్రయత్నంగా నేను అడ్డుపడ్డాను. ‘ఏం అరకు గురించి మనకేం తెలుసు? ఏం చూశామని? అరకు వెళ్తేనే బాగుంటుంది’ అని.
నా మాటలపైన మిత్రులంతా కొంతసేపు తీవ్రంగా చర్చించుకున్నారు. వాళ్ల మాటలు విన్నకొద్దీ నా ప్రతిపాదన నాకు మరింత ఆసక్తికరంగా తోచింది. మనిషి తన స్వజనం గురించీ, స్వదేశం గురించీ తెలుసుకోకుండా బయటి జీవితం గురించి ఏం తెలుసుకుంటే మాత్రమేం లాభం?
అవును. అరకు వెళ్లడమంటే నువ్వు నీ స్వదేశంలో యాత్రీకుడివి కావడమే. నువ్వు నీ స్వగృహానికి అతిథిగా పోవడమే. అయితేనేం, నీ దేశమేదో, నీ గృహమేదో నీకు నిజంగా తెలిస్తే ఆ యాత్రకు అంతకన్నా పరమార్థమేముంటుంది?
ప్రకాష్, ప్రశాంతీ నా మాటల్ని బలపర్చడంతో అరకు యాత్ర నిశ్చయమైపోయింది.
“అయితే, ఇంతకీ ఎలా వెళ్లాలి?” అడిగాడు మోహన్.
“అదిగో చూసావా, మనకు ఇంత దగ్గర్లో ఉండే అరకు వెళ్లడమెలాగో తెలీదు. మళ్లా మనమేదో వాదిస్తాం ఏవో పెద్దవిషయాల గురించి” అంది వేళాకోళంగా ప్రశాంతి. ‘ఎలా వెళ్లడమంటే, వెళ్లడమనేకాదు, ఐ మీన్, అక్కడ ఏర్పాట్లు, ఎక్కడ ఉండటం, ఏమిటి అన్మదాని గురించి నేనంటున్నది” అన్నాడు రాజు.
“అవును, నిజమే’ అన్నారు తక్కినవాళ్లు.
“మీకా బెంగక్కర్లేదు, రాధికకి తెలిసినతను ఒకాయన పాడేరులో పనిచేస్తున్నాడు. ఆయన్నికాంటాక్ట్ చేస్తే ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తాడు’ అంది ప్రశాంతి.
“అయితే పదండి ఫోన్ చేద్దాం” అన్నారు మిత్రులు.
జెట్‌గేటు దగ్గర పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఎస్. టీ. డి ప్రయత్నించాం. ఎంతసేపు చేసినా లైన్లు కలవలేదు. ఈలోగా నాకే సెకండ్ థాట్స్ వచ్చాయి. పాడేరు కాంటాక్ట్ చేస్తే, ఆ పెద్దమనిషి ఏర్పాట్లన్నీ చూడగలడు. నిజమే. ఎంతో ప్లాన్ట్‌గా, కంఫర్ట్‌బుల్‌గా అరేంజ్ చెయ్యగలడు.
కానీ, ఇంత చక్కగా అన్నీ అమర్చుకుని టేప్‌రికార్డర్లో కాసెట్ పెట్టుకు వినడం లాంటిది కాదేమో అరకుయాత్ర అనిపించింది. అది నీకు దారిమలుపులో, పచ్చికబయళ్ళ లోంచి, హఠాత్తుగా తారసిల్లే పిల్లంగోవి పిలుపులా ఉండాలి. ఆ పాడేరు పెద్దమనిషితో వెళ్తే అదంతా ప్రభుత్వం కళ్లతో చూస్తాడు, చూపిస్తాడు. ఈ చిన్నియాత్ర కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఎందుక్కావాలి?
కానీ, ఆ మాట పైకెట్లా చెప్పేది. అక్కడ ఆ కొండకోనల్లో మనగురించి ఎవ్వరూ ఏ ఏర్పాట్లూ చెయ్యరనుకుంటే రావాలనుకున్న ఆ ఇద్దరూ కూడా రావడం మానేస్తారేమో ననిపించింది.
ఈ ఊగిసలాటలో ఉండగానే ‘హలో’” అంటూ తెలిసిన పలకరింపు.
రమణ!
రమణమేష్టారు అని అందరూ ఆప్యాయంగా పిలిచే ఆ యువకుడు యూనివెర్సిటీలో ఎమ్.జె.ఎమ్.సి పూర్తి చేసాడు. ఫైన్‌ఆర్ట్స్ లో డిప్లొమా చేసాడు. సాహిత్యంలో, సాహిత్య సంఘాల్లో చక్కని ప్రవేశం ఉన్నవాడు. ఫొటోగ్రాఫర్, ఫ్రీలాన్స్ జర్బలిస్టూను.
“అరకు వెళ్లాలని ప్లాన్! పాడేరు కోసం ఫోన్ ట్రై చేస్తున్నాం’ అంటూ మా ప్రపోజల్ వివరించాను.
“అదేమిటి? అరకు వెళ్లడానికి రికమెండేషన్లా!” నవ్వాడు రమణ.
అతని మాటలు వినగానే నాకు ప్రాణం లేచివచ్చినట్టయింది.
“మీరు ఇంతకుముందు అరకు వెళ్లారా?” అనడిగాను. “ఒక్కసారి కాదు, రమణ వాయిస్‌లో కాన్ఫిడెన్స్. “చాలాసార్లు వెళ్లాను. కాని అరకు నాకు బాగా బోధపడ్డ ప్రాంతమని చెప్పుకునే సాహసం మాత్రం చెయ్యలేను. వెళ్లి వచ్చిన ప్రతిసారీ తెలుసుకోవలసింది ఇంకా ఎంతో మిగిలే ఉందనిపిస్తుంది” అన్నాడు. అంతేకాక, “ఆ ఫోన్ పక్కన పెట్టి టీకి పదండి. తక్కిన ప్రోగ్రాం నేను చూస్తాను” అని కూడా అనడంతో మరొక్కమాట మాట్లాడకుండా అతని వెనకనే అడుగులేసాం.
2
డి.బి.కె.రైల్వేలైను
ఆదివారం పొద్దున్నే ఏడుగంటలకల్లా బస్ స్టేషన్ దగ్గర రెండుమూడు రోజులకు సరిపడా లగేజ్ తీసుకుని సిద్ధంగా హాజరవ్వాలన్నాడు రమణ. తీరా మేం బయలుదేరేటప్పటికి అందరూ ఒకరి వెనక ఒకరు జారుకున్నారు. హాష్టల్ నుంచి నాతో పాటు బయటకు కదిలింది ప్రశాంతీ, మేము మరీ బతిమిలాడటంతో సరస్వతీను.
సరస్వతి మంచి సాహిత్యాభిమాని. సంస్కృతసాహిత్యంలో ఎం. ఏ చేసింది. మంచి గాయిక. స్థానిక పైవేటు కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఎలాగూ ఆదివారం కావడంతో మరొకరోజుకి సెలవుపెట్టి మాతో బయలుదేరింది.
మా లగేజ్‌లో ఏం సర్దుకోవాలన్నది ప్రశ్న సర్దుకునేటప్పుడు ప్రతి ఒక్కటీ అవసరమనే అనిపించింది. మళ్లా ప్రతి ఒక్కటీ బరువే అనికూడా అనిపించింది. రగ్గులో, బ్లాంకెట్లో మటుకు తప్పకుండా తెచ్చుకోవాలన్నాడు రమణ. అవే సగం మోత. అక్కడ నీళ్లు బయట తాగకూడదంటే మినరల్ వాటర్‌బాటిల్స్ రెండు పట్టుకున్నాం. ట్రెడ్, బటర్, జామ్, ప్రూట్స్ బాగు నిండా సర్టేం. మాతో పాటు రావడానికి జంకిన మా మిత్రురాళ్లంతా మా సన్నాహాల్ని ఎంతో ఆసక్తిగా చూసేరు. ఒకళ్లిద్దరు మమ్మల్ని ఏడిపించడానికి వచ్చీరాని తుమ్ములు తుమ్మేరు.
మేం బస్టాండ్‌కి చేరుకునేటప్పటికి ఏడున్నరకావొస్తోంది. అప్పటికే అక్కడ గంటనుంచీ ఎదురుచూస్తున్నారు మా కోసం ప్రకాష్, రమణాను. రమణ నీలం రంగు జర్మిన్ తొడిగాడు. భుజాన చిన్న కిట్, మెళ్లో వేలాడుతూ యాషికా.
“రండి, రండి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. పదండి. అదిగో, ఎస్. కోట బస్సు” అన్నాడు రమణ.
విశాఖపట్టణం నుంచి శృంగవరపుకోట సుమారు యాభై కిలోమీటర్లు. మేం చూసుకోకుండా ఎక్కిన బస్సు పాసెంజర్ బస్సు కావడంతో గంటంపావులో చేరాల్సిన ఊరు దాదాపు రెండుగంటల ప్రయాణం తర్వాత గాని చేరలేకపోయాం. పొద్దుటిపూట తాకిన చల్లని ఎదురుగాలికి ప్రయాణంలో మగతగా చిన్న కునుకు కూడా పట్టింది.
ఎస్. కోటలో దిగగానే ‘పదండి ట్రేక్ ఫాస్ట్ కి’ అన్నాడు రమణ. మేం ట్రేక్ ఫాస్ట్ ముగించుకుని బయటకు వచ్చేటప్పటికి టైం పదిన్నర కావొస్తోంది. రమణ మమ్మల్ని రైల్వే స్టేషన్‌కి తీసుకుపోయాడు.
“ఓహో! రైలు ప్రయాణమా! భలే’ అంది ప్రశాంతి.
‘మనం ఈ ట్రైను విశాఖలోనే ఎక్కొచ్చు. కానీ ఇక్కడిదాకా ఆ ప్రయాణం బాగా బోర్, అందుకే బస్సులో తీసుకొచ్చేసాను మిమ్మల్ని! అన్నాడు రమణ. తీరా స్టేషన్‌లో కనుక్కుంటే రైలు విశాఖలో అప్పుడే బయల్దేరిందనీ, ఇంకో గంటకి గానీ రాదనీ సమాచారం.
‘ ఈ గంట గడిపేదెట్లా’ అంది సరస్వతి.
“మనం ఇంకా ముందే వచ్చి వుంటే ఇక్కడ పుణ్యగిరి క్షేత్రానికి తీసుకుపోదామనుకున్నాను మిమ్మల్ని అన్నాడు రమణ. ఒక్క క్షణంపాటు ఏమాలోచించాడో ఏమో ‘మనం ఇదే రైలు ఇక్కడ కాకుండా దీని తర్వాత వచ్చే బొడ్డవార స్టేషన్లో ఎక్కుదాం. అదొక అనుభవం’ అన్నాడు.
కొద్దిగా చలికి తడిసిన పసిడిరంగు ఎండలో జట్కా బండొకటి ఎక్కాం. ఆ బండి నాలుగైదు కిలోమీటర్లు ముందుకుపోయి పక్కన మామిడితోపుల్లోకి తిరిగింది. అ మామిడితోపుల్లోంచి సన్నని మట్టిబాట వెంబడి మనుష్యసంచారం ఆట్టే లేని ఒక రైల్వేస్టేషన్లో అడుగుపెట్టాం. ఇంకా కౌంటర్లు తెరవలేదు. అక్కడ మంచుకు తడిసిన సిమెంట్‌చప్టాలమీద చతికిలపడ్డాం. మంచినీటి కొళాయి దగ్గర ముఖం కడుక్కున్నారు రమణ, ప్రకాష్,
‘దీన్ని డి.బి.కె రైల్వే లైనంటారు’ రమణ చెప్పడం మొదలుపెట్టాడు. ‘దండకారణ్య- బొలంగీర్- కిర్‌బూర్ స్టేషన్లను కలిపే ఈ రైల్వే లైను దేశంలోనే చాలా ప్రత్యేకమైన ఇంటర్ స్టేట్ రైల్వే లైను. మధ్యప్రదేశ్ లోని దండకారణ్యాన్ని, ఒరిస్సాలో బొలంగీర్‌ని, బీహార్ దక్షిణప్రాంతపు అంచుల్లోని కిర్‌బూర్ గనుల్ని కలిపే ఈ రైల్వే లైనుని 1960 లో ప్లాన్ చేసారు. నిర్మాణం 1962లో మొదలుపెట్టారు. ఈ లైను మీద మొదటి రైలు 1967లో నడిచింది”
‘సముద్రమట్టం నుంచి నెమ్మదిగా నాలుగైదు వేల అడుగుల ఎత్తుకు సాగే ఆ ఆరోహణ దాదాపు ఏడువందల కిలోమీటర్ల ప్రాజెక్టు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం మనం ఇప్పుడు ప్రయాణం చెయ్యబోతున్న మార్గమే. సుమారు నాలుగయిదు వందల కిలోమీటర్ల పొడుగున పోయే ఈ లైనుని విశాఖపట్టణం -బైలదిల్లా లైనంటారు…’
‘బైలదిల్లా, బైలదిల్లా.. ఎక్కడో విన్నానే ఈ పేరు’ గొణిగింది సరస్వతి.
“ఆ! నన్ను చెప్పమంటారా! ‘బైలదిల్లా అడవుల్లో దగాపడ్డ చెల్లెత్త పోరాటం”. చదివేరా మీరా పుస్తకం!” మెప్పుకోలు కళ్లతో అడిగాడు రమణ.
‘అవునవును. గొప్ప పుస్తకం. ఆ బైలదిల్లా ఇదేనా’ అంది సరస్వతి.
‘అయితే ఈ లైను ఎందుకు వేసారు?’ అడిగాడు ప్రకాష్,
‘అదే చెప్పబోతున్నాను’ వివరించాడు రమణ. ‘అప్పట్లో ఏడాదికి ముప్పై కోట్లు విలువచేసే ఇనుపఖనిజాన్ని జపాన్‌కి ఎగుమతి చేయడానికి మన ప్రభుత్వం ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం ఈ రైల్వేలైను వేసారు. దీనికి ముఖ్యంగా రెండు గనులు-దక్షిణ బీహార్‌లో కిర్‌బూర్. బస్తర్ జిల్లాలో బైలదిల్లాను. అప్పటి లెక్క ప్రకారం ఏడాదికి ఆరుమిలియను టన్నుల ఇనుపఖనిజాన్ని ఎగుమతి చెయ్యాలని ఒప్పందం.’
‘అమ్మో! అంత మినరల్ రిసోర్స్ మనం ఉపయోగించుకోకుండా అమ్మేసుకుంటున్నామా’ అంది (ప్రశాంతి. ‘దాన్ని మనమే ఉపయోగించుకోవచ్చు కదా! ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ వచ్చింది కదా!’ అంది.
‘స్టీల్ ప్లాంట్‌కి సరఫరా చెయ్యగా కూడా ఇంకా ఎంతో తవ్వకమవుతోంది ఎగుమతికి. సరే, ఆ వివరాలన్నీ తర్వాత. పదండి, రైలొచ్చే వేళయింది’ అని స్టేషన్‌మాష్టర్ రూమ్ వైపు దారి తీసాడు రమణ.
3
నిత్యజ్యోత్స్న
బొడ్డవార స్టేషను నుండి బొర్రా గుహలదాకా ఆ రోజు ఆ రైల్లో చేసిన ప్రయాణం వింతైన అనుభవం. కొండలమీంచి పాకే వెయ్యికాళ్ల కొండచిలువలాగా నడిచింది రైలు. మేం ఎక్కిన కొద్ది సేపటకే సొరంగమొకటి ఎదురయ్యింది మాకు. ఆ కొండ సొరంగంలోంచి రైలు పోతూంటే బోగీల్లో అలముకున్న చీకటి తెచ్చిన ఫీలింగ్.
ఆ టన్నెల్ దాటి రెండవ టన్నెల్ వచ్చేలోగా ‘అటు చూడండి, అటు చూడండి’ అన్నాడు రమణ కొండవైపు చూపిస్తూ. ఒక్క ఉదుటున తల తిప్పి చూసాం. పైన ఆకాశపు అంచుల్లోంచి దూకుతున్నట్టుగా జలపాతమొకటి త్రుటిలో మెరిసిదాటిపోయింది.
‘అరె, ఫొటో తీస్తే ఎంత బావుణ్ణు’ అన్నాను.
‘మీరేం బెంగపడకండి. ఎన్నేళ్లు గడిచినా అదక్కడే ఉంటుంది. ఇప్పటికెన్నిసార్లో నన్నదట్లా సర్ ప్రైజ్ చేసి’ అన్నాడు రమణ.
చూస్తూండగానే రైలు కొండలెక్కడంలో నిమగ్నమైంది. కనిపించే కొండలంతటా దట్టంగా అల్లుకున్న మహారణ్యాలు. శరత్కాలం నుంచి హేమంతంలోకి ప్రయాణిస్తున్న ఆకుపచ్చదనం. మధ్యలో టన్నెల్స్ అంధకారం. ఆగీ ఆగీ దోబూచులాడుతున్న ఆకుపచ్చదనం నెమ్మదిగా మమ్మల్ని ఆవహించడం మొదలుపెట్టింది.
రైలు సొరంగంలో ప్రవేశించేముందు, బయటకి వచ్చేటప్పుడు తల బయటకు పెట్టి కుతూహలంగా చూస్తున్న ప్రశాంతితో ‘ఆ టన్నెల్స్ లెక్కపెడుతున్నారా? ఎప్పటికీ ఆ లెక్క పూర్తి కాదు. మధ్యలో అడవీ, జలపాతాలూ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తాయి. అందుకని మీ కోసం నేను ముందే లెక్కపెట్టేసాను. ఈ కనుమల్లో టన్నెల్స్ మొత్తం నలభై తొమ్మిది. అన్చిట్లోకీ పొడుగైన టన్నెల్…’ అంటూ రమణ వివరాలు ఏకరువు పెడుతున్నాడు.
‘అటు విను, అటు విను’ అంటూ నా భుజాన్ని తట్టింది ప్రశాంతి. అక్కడొకరి చేతిలో పాకెట్‌సైజు కాసెట్ ప్లేయర్లో ‘1942-ఎ లవ్ స్టోరీ’ లో పాట. ఆ అడవుల్లో సాగుతున్న ఆ రైలులో ఆ పాట చాలా అసందర్భంగా అనిపించింది నాకు. అదే మాట సరస్వతితో అనకుండా ఉండలేకపోయాను. సరస్వతి చదువుల తల్లి కదా. ‘ఈ అడవిని చూస్తుంటే నాకు ఆ పాట వినబడటం లేదు. కాళిదాసు మేఘసందేశం గుర్తొస్తోంది. ఈ శ్లోకం విను’ అంది.
యత్రోన్మత్త భ్రమర ముఖరాః పాదపా నిత్య పుష్పా
హంసశ్రేణి రచితరశనా నిత్య పద్మానళిస్యః
కేకోత్కణ్డా భవన శిఖినో నిత్య భాస్వత్కలాపాః
నిత్యజ్యోత్స్నాః ప్రతిహత తమో వృత్తి రమ్యాః ప్రదోషాః
‘ఆ అడవుల్లో ఎప్పుడూ వెన్నెలేనట. ఎంత గొప్పగా అన్నాడు’ అంది.
Walking Through Araku
1
As a Guest to Your Home
Prakash, Prasanthi, and I were standing in the corridor of Gallery 62-A at the Andhra University Arts College. We had just walked out after writing the final paper of our Public Administration exams. Our farewell to the university life we had lived for two years had now begun. A sparkle of joy from those closing days lingered in everyone’s heart, closely accompanied by a touch of sadness. All the memories of the life we had shared until now came rushing back like a procession.
The evening beach glistening with rising ocean waves; prayers in front of the Kali temple; the indescribable peace at the Ramakrishna Math; Prasanthi’s lively days at the ladies’ hostel in Maharanipeta; the glittering metropolitan market stretching all the way along Main Road from Jagadamba Centre… as countless memories overwhelmed us, there arose a deep desire to hold onto those passing days once more—like catching flowing river water in cupped hands—and hold them close to the heart.
In those few moments of sweet silence, a suggestion came from someone in the circle of friends gathered around us:
“Before we part ways, let’s go to Araku Valley once, guys!”
The moment I heard the name Araku, a vivid scenery unfolded before my eyes: vast expanses of lush green canopy framed beneath deep blue skies. In that vision flickered wild blossoms, songs, and the collective folk dances of tribal communities echoing across mountain valleys. Perhaps these impressions had gathered over time from passing conversations or pictures seen long ago. Or maybe they were flashes of imagery my mind had quietly strung together from the stories told by various people.
“What is there to see in Araku? Let’s think of somewhere else,” someone remarked.
I instinctively interrupted: “Why? What do we actually know about Araku? What have we even seen? Going to Araku would be wonderful.”
My friends debated the idea intensely for a while. As I listened to them, my proposal felt even more compelling. What is the point of learning about the world outside if one doesn’t even know one’s own people and homeland?
Indeed. Going to Araku means becoming a pilgrim in your own land. It is like visiting your own home as a guest. And yet, if you truly discover what your country and your home really are, what greater purpose could a journey have?
With Prakash and Prasanthi backing my words, the trip to Araku was finalized.
“So, how do we get there?” asked Mohan.
“Look at that! Araku is so close to us, yet we don’t even know how to reach it. And here we are, debating grand philosophical topics,” Prasanthi teased.
“I don’t just mean traveling there. I mean the arrangements—where to stay and all that,” clarified Raju.
“Yes, that’s true,” the others agreed.
“You don’t need to worry about that. A friend of Radhika works in Paderu. If we contact him, he will take care of all the arrangements,” Prasanthi said.
“Then come on, let’s make a phone call,” our friends chimed in.
We tried dialing an STD call from the public telephone booth near the JET gate. No matter how many times we tried, the lines would not connect.
Meanwhile, second thoughts began to stir in my mind. If we contacted the gentleman in Paderu, he would certainly take care of everything. True, he could arrange it very methodically and comfortably.
However, it felt to me that a journey to Araku shouldn’t be like neatly organizing everything and playing a cassette in a tape recorder. It ought to feel like the sudden, unexpected melody of a flute drifting from green meadows around a mountain bend. If we traveled through that official in Paderu, he would see and show everything through government eyes. Why should even this little journey turn into a government-sponsored tour?
Yet, how could I say that out loud? I worried that if they thought no arrangements were in place in those remote hills, even the two who wanted to join might drop out.
While I was caught in this dilemma, a familiar voice called out: “Hello!”
It was Ramana!
Affectionately called “Ramana Master” by everyone, this young man had completed his Master’s in Journalism and Mass Communication (MJMC) at the university and held a diploma in Fine Arts. He had a deep appreciation for literature and literary groups, and worked as both a photographer and a freelance journalist.
“We’re planning a trip to Araku! Trying to place a call to Paderu,” I explained our plan.
“What’s this? Needing recommendations just to visit Araku?” Ramana laughed.
Hearing his words, I felt an immediate sense of relief.
“Have you been to Araku before?” I asked.
“Not just once,” Ramana replied with quiet confidence. “I’ve been there many times. But I wouldn’t dare claim that I fully understand Araku. Every time I return, I feel there is still so much left to discover.”
He added, “Put that phone aside and let’s go grab a tea. I’ll take care of the rest of the plan.”
Without saying another word, we followed right behind him.
2
DBK Railway Line
Ramana told us to report at the bus station by seven on Sunday morning, carrying enough luggage for two or three days. When the time came to leave, everyone backed out one after another. Prasanthi stepped out of the hostel with me, and after much pleading on our part, Saraswati joined as well.
Saraswati was a passionate lover of literature. She had an MA in Sanskrit literature and was a talented singer, working as a lecturer at a local private college. Since it was a Sunday anyway, she applied for leave for an extra day and set out with us.
Deciding what to pack was a dilemma. While packing, every single item felt necessary, yet each one also felt heavy. Ramana had insisted on bringing along rugs or blankets, which made up half the load. Since we were advised not to drink open tap water there, we took along two bottles of mineral water. We packed a bag full of bread, butter, jam, and fruit. The friends who were too hesitant to join watched our preparations with great curiosity. A couple of them even faked sneezes just to tease us.
By the time we reached the bus stand, it was nearly seven-thirty. Prakash and Ramana had already been waiting there for an hour. Ramana wore a blue jerkin, carrying a small kit bag over his shoulder and a Yashica camera slung around his neck.
“Come on, hurry! We’re already late. Look, there’s the S. Kota bus,” Ramana called out.
Srungavarapukota is about fifty kilometers from Visakhapatnam. Because we boarded a local passenger bus without realizing it, the journey that should have taken an hour and a quarter took nearly two hours. The cool morning breeze blew against our faces, lulling us into a light slumber along the way.
The moment we got off at S. Kota, Ramana said, “Come on, let’s grab breakfast.” By the time we finished and stepped outside, it was almost ten-thirty. Ramana led us toward the railway station.
“Oh, a train journey! Wonderful!” exclaimed Prasanthi.
“We could have boarded this train in Visakhapatnam itself, but the journey up to this point is quite boring. That’s why I brought you by bus,” Ramana explained. However, upon checking at the station, we learned that the train had only just departed from Visakhapatnam and would take another hour to arrive.
“How are we going to spend this hour?” Saraswati asked.
“If we had arrived earlier, I wanted to take you to the Punyagiri shrine nearby,” said Ramana. Thinking for a moment, he added, “Instead of boarding here, let’s catch this train at the next stop, Boddavara station. That will be an experience in itself.”
Under the golden sunlight cut by a gentle chill, we boarded a horse-drawn jutka cart. The cart traveled four or five kilometers ahead and turned into mango groves by the side of the road. Following a narrow dirt trail through the groves, we stepped into a quiet, deserted railway station. The ticket counters had not opened yet. We sat down on the cement benches damp with morning mist, while Ramana and Prakash washed their faces at a water tap.
“This is called the DBK Railway Line,” Ramana began. “Connecting the stations of Dandakaranya, Bolangir, and Kiriburu, this is a very unique interstate line in the country. Connecting Dandakaranya in Madhya Pradesh, Bolangir in Orissa, and the Kiriburu mines on the southern edges of Bihar, this line was planned in 1960. Construction began in 1962, and the first train ran on this track in 1967.”
“Rising gradually from sea level to an altitude of four to five thousand feet, the entire project spans nearly seven hundred kilometers. The most fascinating stretch is the one we are about to travel right now. Running for about four to five hundred kilometers, this section is known as the Visakhapatnam–Bailadilla line…”
“Bailadilla, Bailadilla… I’ve heard this name somewhere,” Saraswati murmured.
“Ah, let me guess! Bailadilla Adavullo Dagapadda Chellemma Poratam (The Struggle of the Betrayed Sister in the Bailadilla Forests). Have you read that book?” Ramana asked with admiring eyes.
“Yes, exactly! A great book. Is this that same Bailadilla?” asked Saraswati.
“Why was this railway line laid in the first place?” asked Prakash.
“That’s what I was coming to,” Ramana explained. “Back then, our government built this line under an agreement with Japan to export iron ore worth thirty crore rupees annually. It primarily linked two mines—Kiriburu in southern Bihar and Bailadilla in Bastar district. Under the agreement, six million tonnes of iron ore were to be exported every year.”
“Goodness! Are we selling away our mineral wealth instead of using it ourselves?” Prasanthi remarked. “Couldn’t we use it on our own? After all, we have the steel plant now!”
“Even after supplying the steel plant, vast amounts are still mined for export. Anyway, more on that later. Come on, it’s time for the train,” Ramana said, leading the way toward the station master’s office.
3
Perpetual Moonlight
The journey on that train from Boddavara station to the Borra Caves was a surreal experience. The train moved like a thousand-legged python slithering over the hills. Shortly after we boarded, a tunnel appeared before us. As the train cut through that mountain tunnel, darkness swept over the compartments, creating an eerie thrill.
Before we could exit that tunnel and reach the second one, Ramana pointed toward the mountain and called out, “Look there, look there!”
We turned our heads all at once. Like water leaping from the very edges of the sky, a waterfall flashed into view and whisked past in a split second.
“Ah, how wonderful it would have been to take a photograph!” I said.
“Don’t worry at all. No matter how many years pass, it will stay right there. It has surprised me like this so many times before,” Ramana replied.
Before our eyes, the train busied itself with scaling the hills. Thick, dense forests wrapped around every visible slope. It was a greenery transitioning from autumn into early winter. Interspersed with the darkness of the tunnels, that playful, hide-and-seek greenery gradually began to cast its spell over us.
Watching Prasanthi stick her head out with curiosity every time the train entered and exited a tunnel, Ramana said, “Are you counting the tunnels? You will never finish counting. The forests and waterfalls in between will confuse you. That is why I have already counted them for you. There are forty-nine tunnels in these mountain passes in total. The longest tunnel of all is…” Ramana went on rattling off the details.
“Listen to that, listen over there,” Prasanthi tapped my shoulder.
From a pocket-sized cassette player held by a fellow passenger, a song from 1942: A Love Story was playing. To me, that song felt completely out of place on a train gliding through those wild forests. I could not help mentioning this to Saraswati.
Saraswati, being a scholar at heart, said, “Looking at this forest, I can’t even hear that song. It reminds me of Kalidasa’s Meghaduta. Listen to this verse:”
Yatronmatta bhramara mukharāḥ pādapā nitya puṣpā
Hamsaśreṇi racitaraśanā nitya padmānaḷinyaḥ
Kekotkaṇṭhā bhavana śikhino nitya bhāsvatkalāpāḥ
Nityajyotsnāḥ pratihata tamo vṛtti ramyāḥ pradoṣāḥ
“He says that in those forests, there is perpetual moonlight everywhere. How magnificently he put it!” she remarked.
21-8-2026


ఆహా.. ఎంత బాగుందో.. మీ యాత్ర కథన ఆరంభం..
ధన్యవాదాలు సార్
మనిషి తన స్వజనం గురించీ, స్వదేశం గురించీ తెలుసుకోకుండా బయటి జీవితం గురించి ఏం తెలుసుకుంటే మాత్రమేం లాభం?
ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న.
ధన్యవాదాలు సోమశేఖర్!
మీ ఈ అరకు యాత్రలో కొంచెం చరిత్ర, కొంచెం కవిత్వం, స్నేహం, రైలు ప్రయాణం, ప్రకృతి,మీరు చూసిన దృశ్యాలను మాకూ చూపిస్తూ మీరు మలిచిన అద్భుతమైన పదచిత్రాలు!!
చాలా బాగుంది సర్!