రెండేళ్ళ కిందట 'పోస్టు చేసిన ఉత్తరాలు' నా బ్లాగులో రాస్తున్నప్పుడు వాటికి మొదటిపాఠకురాలు మానసనే. ఇప్పుడు పుస్తకంగా వెలువరించినప్పుడు కూడా ఆమెనే మొదటిపాఠకురాలిగా తన అద్భుతమైన స్పందనని ఫేస్ బుక్కులో తన వాల్ మీద పంచుకున్నారు. ఆ అపురూపమైన వాక్యాల్ని మీతో పంచుకోకుండా ఎలా ఉంటాను!
