ఈ కాయం 'ప్రసాది కాయం' అంటే భగవంతుడి ప్రసాదంగా లభించింది, దీన్ని నిరసించడంగాని, శుష్కింపచెయ్యడంగాని బసవన్నకి సమ్మతం కాదు. కాని ఈ కాయాన్ని దాసోహంకోసం, శివసంఘం కోసం వినియోగించాలన్నది ఆయన పెట్టిన షరతు. కాబట్టి లింగం ఒక లక్షణ భావన. జంగముడు ఒక లక్ష్య భావన.
