పునర్యానం-56

ఈ కవితకు వచ్చేటప్పటికి నేను నా సంకోచాలనుంచి పూర్తిగా బయటపడ్డాను. చిన్నప్పుడే మహాభక్తవిజయం చదివి, పోతన్నని కంఠస్థం చేసినా కూడా, విశ్వాసం కుదురుకోవాలంటే ఇంత జీవితం సాగి ఉండాలా అనిపిస్తుంది. నేను విశ్వాసిని అని చెప్పుకోడానికి ఇప్పుడు నాకేమీ సందేహం లేదు. కాని ఆ విశ్వాసం దృఢపడేముందు ఎంత నరకం చూసానని!