పునర్యానం-55

నిజంగా అలాంటి వ్రతం ఒకటి మనం పాటించగలిగితే! నెలరోజులు కాదు, కనీసం ఇరవైనాలుగ్గంటల పాటు! పరుషవాక్కు లేని ప్రపంచంలో నెలకు నాలుగు వానలు తప్పకుండా పడతాయన్న నమ్మకమైతే నాకుంది. ఆ నమ్మకానికి చేరుకున్నాక రాసిందే ఈ కవిత.