జీవితపు ప్రతి మలుపులోనూ ప్రతి వర్షాకాలంలోనూ అటువంటి వర్షం ఒకటేనా సాక్షాత్కరిస్తుంది. వర్షం మామూలుగా ఏదో ఎడబాటుని, లోటుని, ఏదో ప్రతీక్షని గుర్తుచేసే అనుభవం. కాని ఆ ఒక వర్షం ఉంటుందే, ఒక మహావర్షం, అది నిన్ను నిలువెల్లా ప్రక్షాళితం చేసి వెళ్ళిపోతుంది. నిన్ను పూర్తిగా కడిగేస్తుంది, నీ మాలిన్యాల్ని, నీ ప్రలోభాల్ని ఊడ్చేస్తుంది.
