బహుశా ఈ యాభై ఏళ్లుగా నాలో మారనిది, ఇంకా చెప్పాలంటే మరింత ప్రజ్వరిల్లుతున్నది ఏదైనా ఉందంటే అది నా జిజ్ఞాస మాత్రమే. ఈ జిజ్ఞాసని పెంచి పోషించి ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ దీపం ప్రజ్వరిల్లుతూ ఉండేటట్లుగా చూడటమే తాడికొండ నాకు ఇచ్చిన గొప్ప కానుకగా నేను భావిస్తున్నాను.
SMALL KIDS, THOSE EYES
Still waiting are the small kids, A pair of forlorn eyes.
సంస్కారవంతుడు
నా దిగ్భ్రాంతికి కారణాలు రెండు. మొదటిది, అతడి భాష. అది చాలా సున్నితమైన, గాఢమైన, అత్యంత కవితాత్మకమైన భాష. నిజానికి అటువంటి భాష కవుల దగ్గర నేర్చుకోవలసిందే తప్ప, కళాశాలలు నేర్పగలిగేది కాదు. ఏ కవులు అతడిని ఎంత అనుగ్రహిస్తే అతడికి అంత పువ్వులాంటి భాష పట్టుబడుతుంది!
