గురుప్రసాదరావుగారి  గురించి

కాని వారం పది రోజుల కిందట ఒక రాత్రి ఆ పుస్తకం తీసి చూద్దును కదా, అందులో, గురుప్రసాద రావుగారికి చలం గారు రాసినవీ, సంజీవ దేవ్ గారు రాసినవీ కొన్ని ఉత్తరాలు కూడా ఉన్నాయి. ఆ ఉత్తరాలు చదివేటప్పటికి నేను మాటల్లో పెట్టలేని ఒక అనిర్వచనీయమైన సంతోషం నన్ను ఆవహించింది. నా సొంత నేలకి నేను మరింత దగ్గరగా జరిగాననిపించింది.

పూలబాసలు

అది యేమి భాష! తెలుగు అక్షరాల ఐశ్వర్యాన్ని అంతలా కొల్లగోట్టుకున్న కవుల్ని ఆధునిక కవుల్లో వేళ్ళమీద మాత్రమే లెక్కపెట్టగలం.