ఫలితంలో ఆసక్తి నిజానికి చాలా స్థూల రూపం. దాన్ని మనం సులభంగా గుర్తుపట్టగలం. కాని, ప్రతిఫలం ఆశించకుండా, సేవచేస్తున్నామని మనలో మనకు తెలియకుండానే కలిగే సంతోషలవలేశం కూడా మనల్ని బాధిస్తుందని నాకు ఏళ్ళ మీదట అర్థమయింది.
గాంధీ కర్మజీవితం
అందులో మనకు బాగా తెలిసిన పార్శ్వాలు- బారిష్టరు, నేతపనివాడు, గ్రంథ రచయిత, పాత్రికేయుడు, ముద్రాపకుడు-ప్రచురణ కర్త వంటి వృత్తులతో పాటు మనకు అంతగా వివరాలు తెలియని కార్మిక జీవిత పార్శ్వాలు- బట్టలుకుట్టేవాడు, బట్టలు ఉతికేవాడు, క్షవరం చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, వంటవాడు, వైద్యుడు, నర్సు, రైతు వంటి వాటి చిత్రణ కూడా ఉంది.
మేలిమి సత్యాగ్రాహి
1906 లో దక్షిణాఫ్రికాలో భారతీయుల పోరాటానికి గాంధీ కొత్త అస్త్రమొకటి కనుక్కున్నాడు. ఆ అస్త్రానికి పదునుపెట్టే క్రమంలో,మానవచరిత్రలో అటువంటి సత్యాగ్రాహులెవరైనా ఉన్నారా అని అన్వేషించినప్పుడు సోక్రటీస్ లో అతడికి అటువంటి మేలిమి సత్యాగ్రాహి కనిపించాడు.
