జాన్ ఏష్ బెరీ

పది రోజులకిందట జాన్ ఏష్ బెరీ (1927-2017) మరణించినప్పుడు, అమెరికాలో చిట్టచివరి ప్రభావశీలమైన కవి నిష్క్రమించాడని పత్రికలన్నీ నివాళి అర్పించాయి. తొంభై ఏళ్ళ పాటు జీవించిన ఒక కవి లోకాన్ని వదిలివెళ్ళడంలో మనం తట్టుకోలేనిదేమీ ఉండకపోయినప్పటికీ, అతణ్ణి కోల్పోవడం మనల్ని బాధించకుండా ఉండదనీ, సుదీర్ఘకాలం పాటు అతడు మన భావనాప్రపంచంలో నిజంగా తనకంటూ ఒక ఉనికి ఏర్పరచుకున్నాడనీ ఒక పత్రిక రాసింది.