'రాత్రి మా అమ్మగారు నాకు కలలోకి వచ్చారు. ఆమె రెండెండ్ల బండిమీద పంట మూటలుగట్టుకుని తనే బండి తోలుతున్నట్టు కనబడ్డారు. మా నాన్న కాదు, మా పొలంలో పనిచేసే మనుషులు కాదు, స్వయంగా మా అమ్మగారే పంట బండికెత్తి తానే బండితోలుతున్నట్టు కలలో కనిపిస్తే, పురాతన మాతృస్వామ్యసమాజం మళ్ళా ప్రత్యక్షమైనట్టే అనిపించింది' అని పరవశిస్తూ చెప్పారామె.
నా భిక్షాపాత్ర నిండింది
ఈసారి కూడా అలాగే మరో వంద డాలర్ల మేరకు పుస్తకాలు తెస్తానంటే కాదన లేకపోయాను. అందుకని, ఇదుగో, ఈ పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాల కోసమైతే నా భిక్షాపాత్ర ఎత్తిపట్టుకోడానికి నాకెప్పటికీ సంతోషమే.
పోస్టు చేసిన ఉత్తరాలు-7
నిజమే, ఈ వార్తలు ప్రపంచానికి అక్కర్లేదు. కానీ ప్రపంచం పసిది, దానికేం తెలుస్తుంది? చూడు, ఆకాశమూ, సూర్యరశ్మీ తనకు అవసరంలేదన్నట్టే ఉంటుంది పొద్దున్న లేచి దాని నడవడి. కాని అవి లేకపోతే ప్రపంచం క్షణం కూడా మనజాలదని మనకు తెలుసు. అందుకనే నిజమైన కవి తనని తాను ముందు భగవంతుడి వార్తాహరుడిగా నియమించుకుంటాడు.
