స్వస్థత (స్వ+స్థ) అంటే నీలో నువ్వు ఉండడం. నీకు నువ్వుగా ఉండడం. నీలోంచి నువ్వుతప్పిపోవటమే అనారోగ్యం. తిరిగి ఎవరైనా నిన్ను నీకు అప్పగిస్తే, నీలో శకలాలుగా విడిపోతున్న భావోద్వేగాలను ఒకచోటకు చేర్చి నిన్ను మళ్లా సమగ్రంగా నిలబెట్టగలిగితే అంతకు మించిన చికిత్స మరొకటి లేదు.
పునర్యానం-48
కేవలం అనుభవాల్నే రచనలుగా మార్చడం మీద నాకు ఆసక్తి లేదు. ఆ అనుభవాలు నా గురించో, ప్రపంచం గురించో ఏదో ఒక కొత్త సత్యానికి చేర్చగలవన్న నమ్మకం ఉంటేనే వాటిని కథలుగానో, కవితలుగానో మార్చడానికి పూనుకుంటాను.
పునర్యానం-47
బహుశా ఆ కిటికీ లేకపోయుంటే నేను ఆ ఇంట్లో అన్నేళ్ళు ఉండగలిగి ఉండేవాణ్ణి కానేమో. ఈ ఊళ్ళోనూ ఉండేవాణ్ణి కానేమో. కనకనే, ఆ కిటికీ లేకపోతే నాకీ నగరం కూడా లేదని రాసుకున్నాను.
