ప్రత్యూష పవనాలు

ప్రత్యూష పవనాలు చిన్న పుస్తకం. కొందరు మహాత్ముల రచనలనుంచి ఏరి కూర్చిన కొన్ని వాక్యాలు. 1996 లో వెలువరించిన ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా లభ్యంగా లేదు. కొత్తగూడెం కి చెందిన కిరణ్ గారి పుణ్యమా అని అప్పటి పుస్తకం పిడిఎఫ్ ఒకటి దొరికింది. దాన్ని ఇలా లే ఔట్ మార్చి రెండో ముద్రణగా మీతో పంచుకుంటున్నాను. మంచిమనిషి వెలమూరి శ్రీరాం స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను.

ఇది నేనిప్పటిదాకా వెలువరించిన పుస్తకాల్లో వరసలో నాలుగో పుస్తకం.

ఈ పుస్తకాన్ని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.

24-8-2026

5 Replies to “ప్రత్యూష పవనాలు”

  1. Thank you very much sir… నేనూ సోమశేఖర్ గారూ మీ పుస్తకాల లిస్ట్ గురించి మాట్లాడుకుంటూ, ఇది ఏమై ఉంటుందా అనుకోవడం గుర్తు… ఆయన ఈ పోస్ట్ చూస్తే, నాలాగే ఉత్సాహంగా పేజీలు తిప్పి చూసుకుంటారు. కిరణ్ గారికి మా అందరి తరఫునా థాంక్యూ.

    శాఫో పుస్తకాలు చేరాయి. పుస్తకంగా చదవడం ఎంతో బాగుంది.

    భద్రుడు గారూ,
    మీరు చందమామ మీద కవితలు రాయాలి. కాస్త ఆయన్ని బుజ్జగించాలి.
    పున్నమి రోజుల్లో పుస్తకాలు కానుక చేసి మీ అక్షరాల వెన్నెలతో ఆయన్ని చిన్నబుచ్చుతున్నారు. ❤️❤️

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!

      చందమామ గురించి మీరు చెప్పిన మాటలు ఒక ప్రబంధ కవి మాత్రమే చెప్పగలడు.

  2. అవును… మానసా! చాలా రోజులుగా వెతుకుతున్న పుస్తకం ఇది.

    పిడిఎఫ్ అందించిన కిరణ్ గారికి ధన్యవాదాలు.

    రెండో ముద్రణగా మాకు మళ్ళీ ఈ పుస్తకం అందించినందుకు ధన్యవాదాలు సర్!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading