అది మా ఇంట్లో మొదటి కులాంతర వివాహం. మా నాన్నగారికి తెలిస్తే అడ్డుపెట్టి ఉండకపోవచ్చు ఏమో కానీ అంగీకరించకపోయి ఉండవచ్చు కూడా. అందుకని మా అక్క మా నాన్నగారికి చెప్పకుండా తనే దగ్గరుండి ఆ పెళ్లి చేయించింది. ఆ పెళ్లి నేను నా జీవితంలో చూసిన వివాహ వేడుకల్లో అత్యంత ఆదర్శవంతమైన వివాహ వేడుక.
