ఒక సంగమస్థలి

గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి పరుసవేది స్పర్శని జగన్నాథరావుగారి దగ్గర ఎంతో సెక్యులర్‌ ఎన్‌విరాన్‌మెంట్‌లో మనం చూడగలగడం చాలా థ్రిల్లింగ్‌గానూ, కన్వీన్సింగ్‌గానూ వుంటుంది.

చదివే విద్య, రాసే విద్య

పిల్లలు చిన్నప్పటి నుంచి చదవడం రాయడం అభ్యాసం చేస్తే అది వాళ్ల జీవితాల్ని వాళ్లు మరింత లోతుగా ఇంటర్నలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఒకరి భావాలు మరొకరికి చెప్పుకోవడం వల్ల సంఘీభావం బలపడుతుంది. ఒకరి భావాలు మరొకరు వినడంవల్ల సహన సంస్కృతి వర్ధిల్లుతుంది.

సాహిత్యం, సృజన నీలోని అద్వితీయతను వెలికి తీస్తాయి

నీలో నీదే అయిన ఆ ప్రత్యేక లక్షణాన్ని నువ్వు గుర్తుపట్టుకోవాలి. దాని ఆధారంగా నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ ప్రయాణానికి సాహిత్యం, సృజనాత్మక కార్యకలాపం సాయం చేసినంతగా మరేమీ సహకరించలేవు.