నాలుగు తీపి మాటలు

ఇవి అట్లాంటి తొలిక్షణాలు పూసిన పూలు, తొలిదినాల మిగిల్చిన గాయాలు, తొలిరోజులు వెలిగించిన దీపాలు. 'లౌక్యం తెలియని' ఈ వాక్యాల్ని నాకై నేను ఎంతో శ్రద్ధగానూ, ఎంతో ప్రీతితోనూ చదివాను. వీటి మలుపుల్లో ఒక మట్టిబాట వెంబడి ఒక తెలంగాణా పల్లెకి ప్రయాణించిన అనుభూతికి లోనయ్యాను.

ఋషీశ్వరుడు

నాకు తెలిసి నా జీవితంలో నేను సన్నిహితంగా చూసిన నిజమైన అద్వైతి అంటూ ఉంటే అది రాధాకృష్ణమూర్తిగారే. చివరిదాకా ఆయన్ని వెన్నంటి ఉన్న ఆ పసిపాపల దరహాసమే దానికి సాక్షి.