జీవనం సత్యం జీవనం సుందరం

అసలు, ఒక నవల గురించి ఇంత స్వల్పకాలంలో ఇన్ని పరిచయవ్యాసాలు తెలుగులో ఇప్పటిదాకా ఏ నవల గురించీ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. కేవలం ప్రింటు మీడియంలో ఇదెన్నటికీ ఊహించలేని విషయం.

నీలి రంగు హ్యాండ్ బ్యాగ్

ఈ కవిత ఆధునిక మహిళ జీవితకథ అనవచ్చు. ఇందులో ఆమె పాటించిన శిల్పం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. చేరా గారు ఉండి ఉంటే, ఈ కవితలో ఆమె పాటించిన వ్యూహాలమీద, ఒక విశ్లేషణ చేసిఉండేవారనిపించింది.

నా రక్తంలో విషం లేదు

హిందీ మాతృభాష అయిన ఒక యువకుడు ఇంగ్లీషులో రాసిన ఈ కవిత్వంలో గొప్ప సారళ్యం, సూటిదనం కనిపించడం నన్ను కొంత ఆశ్చర్యపరిచింది. ఇంగ్లీషు మాతృభాష కాదనే బెరుకు లేకుండా సాహసంగా చేపట్టిన వాక్యనిర్మాణం, పదప్రయోగం ఈ కవిత్వాన్ని ఇన్నాళ్ళ పాటు సజీవంగా ఉంచాయని చెప్పవచ్చు.