కరుణరసాత్మక కావ్యం

ఆ పుస్తకం ఒక కరుణరసాత్మక కావ్యం అన్నాడు కవితాప్రసాద్ నా 'కొన్ని కలలు కొన్ని మెలకువలు చదివి. అది విద్యా సంబంధమైన గ్రంథమనో, గిరిజన సంక్షేమానికి సంబంధించినదనో అనకుండా దాన్నొక కావ్యమనీ అది కూడా కరుణరసాత్మకమనీ అనడం నా హృదయాన్ని చాలా లోతుగా తాకింది.