ప్రియమైన శాఫో-9

సంగీతవాద్యంకన్నా మరింత సంగీతజనకమనీ, బంగారాన్ని మించిన బంగారమనీ నువ్వు దేన్ని ప్రశంసిస్తున్నావో మాకెప్పటికీ తెలియకుండా పోయింది. అది నీ బిడ్డ చిరునవ్వునా లేక అనక్టోరియా చూపులా లేక ఏజియన్ సముద్రం మీంచి వీచే గాలులా లేక మైటిలెని నగరం మీద కురిసే వెన్నెలా?