ఫణిగిరి:బౌద్ధ శిల్పకళాపతాక-2

మేము మ్యూజియం నుండి బయటకు వచ్చాక ఆ గుట్ట ఎక్కుదామా అని ఒక క్షణం ఆలోచించాం. కానీ మాకు సమయం సరిపోదని అర్థమయింది. ఆ పక్కనే అందమైన తామరపూల కొలను ఒకటి కనిపించింది. ఆ మధ్యాహ్నం వేళకి తామరపూలు ఒకటీ ఒకటీ విచ్చుకుంటున్నాయి. దానికి కొద్ది దూరంలో రెండు కొండలు కలుస్తున్న  లోయలో కాకతీయుల కాలం నాటి ఒక రామాలయం  ఉంది. దానిపక్కనే ఒక గుండం లాంటి కొలనూ, ఒక బావీ కూడా ఉన్నాయి. అంత మిట్టమధ్యాహ్న …